Home » Upasana
ఆదివారం నాడు ఆర్చరీ ప్రీమియర్ లీగ్ ఫినాలే జరగనున్న నేపథ్యంలో టోర్నీ బ్రాండ్ అంబాసిడర్ రామ్ చరణ్ సతీ సమేతంగా ప్రధాని నరేంద్ర మోదీని కలిశారు. ఆయన మార్గదర్శకత్వంలో ప్రపంచవ్యాప్తంగా విలువిద్యకు మరింత ప్రోత్సాహం లభిస్తోందని అన్నారు.
తెలంగాణ స్పోర్ట్స్ హబ్‌కు చైర్మన్‌గా ఆర్పీ సంజీవ్ గోయెంకా గ్రూప్ చైర్మన్ సంజీవ్ గోయెంకా నియమితులయ్యారు. వైస్ చైర్మన్‌గా ప్రముఖ నటుడు చిరంజీవి కోడలు కొణిదెల ఉపాసనను నియమించారు.
ఉపాసనకు తెలంగాణ సర్కార్ కీలక బాధ్యతలు అప్పగించింది. స్పోర్ట్స్ హబ్ కోచైర్మన్‌గా ఆమెను నియమించింది. ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
Telangana Sports Hub: స్పోర్ట్స్ హబ్ ఆఫ్ తెలంగాణకు తనను కో చైర్మన్‌గా నియమించటంపై ఉపాసన సంతోషం వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ధన్యవాదాలు తెలియజేశారు.
సినీ నటుడు రామ్ చరణ్(Ram Charan) ఇంట్లో పెంపుడు చిలుక(Parrot) కనిపించకుండా పోయింది. ఈ విషయాన్ని ఉపాసన ట్వీట్ చేయగా.. యానిమల్ స్వచ్ఛంద సంస్థ నిర్వాహకులు వెతికి పట్టుకొని అప్పగించారు.
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, ఉపాసన దంపతులకు గత ఏడాది జూన్ 20న పాప జన్మించిన విషయం తెలిసిందే. పాపకు మెగా ఫ్యామిలీ క్లీంకారగా నామకరణం చేసింది. అయితే క్లీంకార జన్మించి 9 నెలలు గడుస్తున్నా కూడా పాప ఫేస్ మాత్రం మెగా ఫ్యామిలీ రివీల్ కానివ్వలేదు. నేడు రామ్ చరణ్ పుట్టినరోజు. ఈ సందర్భంగా రామ్ చరణ్ దంపతులు, కూతురు క్లీంకారతో కలిసి వెళ్లి తిరుమల శ్రీవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు.
టాలీవుడ్ స్టార్ హీరో రామ్‌చరణ్ (Ram Charan) తండ్రి కాబోతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఉపాసన (Upasana) డెలివరీపై అనేక రూమర్స్ వచ్చాయి. విదేశాల్లో ఆమె బిడ్డకు జన్మనివ్వబోతుందంటూ పలు కథనాలు వెలువడ్డాయి.