Upasana: డెలివరీ రూమర్స్‌పై క్లారిటీ ఇచ్చిన ఉపాసన కామినేని

ABN , First Publish Date - 2023-02-28T20:35:41+05:30 IST

టాలీవుడ్ స్టార్ హీరో రామ్‌చరణ్‌ (Ram Charan) తండ్రి కాబోతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఉపాసన (Upasana) డెలివరీపై అనేక రూమర్స్ వచ్చాయి. విదేశాల్లో ఆమె బిడ్డకు జన్మనివ్వబోతుందంటూ పలు కథనాలు వెలువడ్డాయి.

Upasana: డెలివరీ రూమర్స్‌పై క్లారిటీ ఇచ్చిన ఉపాసన కామినేని

టాలీవుడ్ స్టార్ హీరో రామ్‌చరణ్‌ (Ram Charan) తండ్రి కాబోతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఉపాసన (Upasana) డెలివరీపై అనేక రూమర్స్ వచ్చాయి. విదేశాల్లో ఆమె బిడ్డకు జన్మనివ్వబోతుందంటూ పలు కథనాలు వెలువడ్డాయి. ఈ వదంతులన్నింటికి చెక్ పెడుతూ ఉపాసన ఇండియాలోనే బిడ్డకు జన్మనివ్వబోతున్నట్టు చెప్పారు.

రామ్ చరణ్ ప్రస్తుతం ఆస్కార్ ప్రమోషన్స్‌లో పాల్గొంటున్నారు. అందులో భాగంగా ప్రముఖ అమెకన్ టాక్ షో ‘గుడ్‌ మార్నింగ్‌ అమెరికా’ లో పాల్గొన్నారు. ఈ కార్యకమ్రంలో మెడికల్‌ కరెస్పాండెంట్‌, గైనకాలజిస్ట్‌ జెన్నిఫర్‌ ఆస్టన్‌ కూడా సందడి చేశారు. చరణ్‌ వ్యక్తిగత విషయాల గురించి చర్చించారు. ఈ సందర్భంగా.. ‘‘ఉపాసన కొద్ది రోజులపాటు అమెరికాలో ఉంటుంది. ఆ సమయంలో మీరు అందుబాటులో ఉంటే బాగుంటుంది’ అని చరణ్‌ తన కోరికను తెలిపారు. అందుకు జెన్నిఫర్‌ సానుకూలంగా స్పందించారు. ‘‘చరణ్‌, ఉపాసనల ఫస్ట్‌ బేబీని డెలివరీ చేయడం నాకు గౌరవమం. అందుకోసం ఎక్కడ అందుబాటులో ఉండమన్నా సిద్ధం’’ అని జెన్నిఫర్ చెప్పారు. దీంతో ఉపాసన డెలివరీ అమెరికాలో జరగుతుందనే ప్రచారం జోరుగా సాగింది. ఈ రూమర్స్ అన్నింటికి చెక్ పెడుతూ ఉపాసన సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టారు. ‘‘డాక్టర్‌ జెన్నిఫర్‌ ఆస్టన్‌ మీరు చాలా స్వీట్‌. మిమ్మల్ని కలిసేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నా. దయచేసి మా అపోలో హాస్పిటల్స్‌ కుటుంబంలో మీరు భాగమవ్వండి. వైద్యులు సుమన మనోహర్‌, రూమా సిన్హాతో కలిసి మా బేబీని డెలివరీ చేయండి’’ అంటూ ఉపాసన ఓ ట్వీట్‌తో క్లారిటీ ఇచ్చారు. ప్రస్తుతం ఆ ట్వీట్‌ స్క్రీన్‌షాట్‌ నెట్టింట వైరల్‌గా మారింది.

^^^^^^^^^^^^^^^^^^^^^^^^

ఇవి కూడా చదవండి:

Ashwini Dutt: ‘ప్రాజెక్ట్ కె’ ఆసక్తికర సంగతులు చెప్పిన నిర్మాత.. మ్యూజిక్ డైరెక్టర్‌లో మార్పు..

Ranbir Kapoor: బెస్ట్ యాక్టర్ అవార్డును అందుకునే అర్హత నాకు లేదు.. ‘పుష్ప’ లో అల్లు అర్జున్ అద్భుతంగా..

RRR: ఇంటర్నేషనల్ అవార్డ్స్‌లో టామ్ క్రూజ్, బ్రాడ్ పిట్‌లతో పోటీ పడుతున్న రామ్ చరణ్, తారక్

Vishal: భారీ ప్రమాదం.. కొంచముంటే విశాల్ ప్రాణాలు పోయేవి.. వీడియో వైరల్

Nani: నెపోటిజానికి కారణం ప్రేక్షకులే..!

Updated Date - 2023-03-01T13:19:26+05:30 IST