Nani: నెపోటిజానికి కారణం ప్రేక్షకులే..!

ABN , First Publish Date - 2023-02-22T16:55:14+05:30 IST

తల్లిదండ్రుల బాటలోనే పిల్లలందరు ప్రయాణిస్తుంటారు. వారి కెరీర్‌ బాటలోనే కొనసాగుతుంటారు. సినీ ఇండస్ట్రీ అందుకు మినహాయింపు ఏం కాదు. నటీనటుల వారసులు కూడా సినిమాలనే కెరీర్‌గా ఎంచుకుంటారు. అయితే, సినీ ఇండస్ట్రీ‌పై ప్రజల ఫోకస్ ఎక్కువగా ఉంటుంది.

Nani: నెపోటిజానికి కారణం ప్రేక్షకులే..!

తల్లిదండ్రుల బాటలోనే పిల్లలందరు ప్రయాణిస్తుంటారు. వారి కెరీర్‌ బాటలోనే కొనసాగుతుంటారు. సినీ ఇండస్ట్రీ అందుకు మినహాయింపు ఏం కాదు. నటీనటుల వారసులు కూడా సినిమాలనే కెరీర్‌గా ఎంచుకుంటారు. అయితే, సినీ ఇండస్ట్రీ‌పై ప్రజల ఫోకస్ ఎక్కువగా ఉంటుంది. అందువల్ల హీరో, హీరోయిన్స్ పిల్లలు సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వగానే నెపోటిజం అనే మాట ఎక్కువగా వినిపిస్తుంటుంది. దాని గురించి అందరు చర్చిస్తుంటారు. బాలీవుడ్ నుంచి టాలీవుడ్ వరకు ఈ మాట తరచుగా వింటూనే ఉంటాం. తాజాగా ఈ టాపిక్‌పై హీరోలు రానా దగ్గుబాటి (Rana Daggubati), నాని (Nani) తమ అభిప్రాయాలను పంచుకున్నారు. ఇన్ సైడర్, ఔట్ సైడర్ అంశంపై మాట్లాడారు.

పాప్ సింగర్ స్మిత (Smita) హోస్ట్ చేస్తున్న షో ‘నిజం’ (Nijam). సోనీ లీవ్ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లో స్ట్రీమింగ్ అవుతుంది. ఈ షోకు సంబంధించిన ఎపిసోడ్స్ ప్రతి శుక్రవారం విడుదల అవుతుంటాయి. తాజాగా ఈ షోకు రానా దగ్గుబాటి, నాని విచ్చేశారు. ఆసక్తికర సంగతులను అభిమానులతో పంచుకున్నారు. ‘‘నాని మొదటి చిత్రాన్ని లక్ష మంది చూస్తే.. రామ్ చరణ్ (Ram Charan) మొదటి సినిమాను కోటి మంది చూశారు. నెపోటిజానికి కారణం ప్రేక్షకులే. నెపోటిజాన్ని ప్రోత్సహిస్తున్నందుకు వారే బాధ్యత వహించాలి. ఎందుకంటే తమ స్టార్ హీరో, హీరోయిన్స్ కుమారులు, కుమార్తెలను వెండితెర మీద వారు చూడాలనుకుంటున్నారు’’ అని నాని తెలిపారు. ‘‘సినీ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చినప్పుడు తల్లిదండ్రుల వారసత్వాన్ని పిల్లలు కొనసాగించాలి. వాటిని మరో స్థాయికి తీసుకెళ్లాలి. ఆ విధంగా చేయకపోతే కుటుంబానికి అన్యాయం చేసినట్టే’’ అని రానా దగ్గుబాటి పేర్కొన్నారు. ఈ ఎపిసోడ్ ఫిబ్రవరి 24న స్ట్రీమింగ్ కానుంది. అందువల్ల వారు ఇంకేం విషయాలపై మాట్లాడారో తెలియాలంటే అప్పటి వరకు వేచి చూడాల్సిందే.

Updated Date - 2023-02-22T16:56:06+05:30 IST