RRR: ఇంటర్నేషనల్ అవార్డ్స్‌లో టామ్ క్రూజ్, బ్రాడ్ పిట్‌లతో పోటీ పడుతున్న రామ్ చరణ్, తారక్

ABN , First Publish Date - 2023-02-23T12:47:24+05:30 IST

దర్శకధీరుడు ఎస్‌ఎస్.రాజమౌళి (SS. Rajamouli) తెరకెక్కించిన చిత్రం ‘ఆర్ఆర్ఆర్’ (RRR). జూనియర్ ఎన్టీఆర్ (Jr NTR), రామ్ చరణ్ (Ram Charan) హీరోలుగా నటించారు. ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద సంచలన విజయం సాధించింది. భారీ స్థాయి వసూళ్లను రాబట్టింది.

RRR: ఇంటర్నేషనల్ అవార్డ్స్‌లో టామ్ క్రూజ్, బ్రాడ్ పిట్‌లతో పోటీ పడుతున్న రామ్ చరణ్, తారక్

దర్శకధీరుడు ఎస్‌ఎస్.రాజమౌళి (SS. Rajamouli) తెరకెక్కించిన చిత్రం ‘ఆర్ఆర్ఆర్’ (RRR). జూనియర్ ఎన్టీఆర్ (Jr NTR), రామ్ చరణ్ (Ram Charan) హీరోలుగా నటించారు. ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద సంచలన విజయం సాధించింది. భారీ స్థాయి వసూళ్లను రాబట్టింది. వరల్డ్ వైడ్‌గా రూ.1200కోట్లకు పైగా కలెక్షన్స్‌ను కొల్లగొట్టింది. ఈ సినిమాలో తారక్, చెర్రీ నటనకు గ్లోబల్ ఆడియన్స్ కూడా ఫిదా అయిపోయారు. హాలీవుడ్‌లోని విమర్శకులు సైతం వారిపై ప్రశంసల వర్షం కురిపించారు. తాజాగా ఓ ఇంటర్నేషనల్ అవార్డ్ కోసం తారక్, చెర్రీ ఒకరితో మరొకరు పోటీపడుతున్నారు.

క్రిటిక్స్ ఛాయిస్ సూపర్ అవార్డ్స్ (Critics Choice Super Awards) నామినేషన్స్‌ను తాజాగా ప్రకటించారు. ఈ పురస్కారాల్లో ‘ఆర్ఆర్ఆర్’ పలు కేటగిరిల్లో నామినేషన్స్ దక్కించుకుంది. బెస్ట్ యాక్షన్ మూవీ, బెస్ట్ యాక్టర్ ఇన్ యాక్షన్ ఫిలిం కేటగిరిల్లో నామినేట్ అయింది. బెస్ట్ యాక్షన్ మూవీ కేటగిరిలో ‘టాప్ గన్: మావెరిక్’, ‘బుల్లెట్ ట్రైన్’, ‘ద అన్‌బేరబుల్ వెయిట్ ఆఫ్ మ్యాసివ్ టాలెంట్’, ‘ఉమెన్ కింగ్’ వంటి చిత్రాలతో ‘ఆర్ఆర్ఆర్’ పోటీపడుతుంది. బెస్ట్ యాక్టర్ ఇన్ యాక్షన్ ఫిలిం కేటగిరిలో రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ నామినేషన్ దక్కించుకున్నారు. ఈ కేటగిరిలోనే ఒకరితో మరొకరు పోటీపడుతున్నారు. హాలీవుడ్ సూపర్ స్టార్స్ టామ్ క్రూజ్ (Tom Cruise), బ్రాడ్ పిట్ (Brad Pitt), నికోలస్ కేజ్‌ (Nicolas Cage)ల సరసన వారు నామినేషన్ దక్కించుకున్నారు. ఈ అవార్డ్ విజేతలను మార్చి 16న ప్రకటిస్తారు. ‘ఆర్ఆర్ఆర్’ ను 1920ల బ్యాక్ డ్రాప్‌లో ఫిక్షనల్ స్టోరీగా రూపొందింది. అల్లూరి సీతారామ‌రాజు, కొమరం భీమ్‌లను స్ఫూర్తిగా తీసుకుని ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఈ మూవీలో అజయ్ దేవగణ్, శ్రియ శరణ్, సముద్ర ఖని, అలిసన్ డూడీ, రే స్టీవెన్సన్, ఒలివియా మోరిస్ తదితరులు కీలక పాత్రలు పోషించారు.

^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^

ఇవి కూడా చదవండి:

Vishal: భారీ ప్రమాదం.. కొంచముంటే విశాల్ ప్రాణాలు పోయేవి.. వీడియో వైరల్

Nani: నెపోటిజానికి కారణం ప్రేక్షకులే..!

Updated Date - 2023-02-23T12:47:25+05:30 IST