Share News

Sports Hub: స్పోర్ట్స్‌ హబ్‌ చైర్మన్‌గా సంజీవ్‌ గోయెంకా

ABN , Publish Date - Aug 05 , 2025 | 03:51 AM

తెలంగాణ స్పోర్ట్స్‌ హబ్‌కు చైర్మన్‌గా ఆర్పీ సంజీవ్‌ గోయెంకా గ్రూప్‌ చైర్మన్‌ సంజీవ్‌ గోయెంకా నియమితులయ్యారు. వైస్‌ చైర్మన్‌గా ప్రముఖ నటుడు చిరంజీవి కోడలు కొణిదెల ఉపాసనను నియమించారు.

Sports Hub: స్పోర్ట్స్‌ హబ్‌ చైర్మన్‌గా సంజీవ్‌ గోయెంకా

  • వైస్‌ చైర్మన్‌గా కొణిదెల ఉపాసన.. కొత్తగా పాలకమండలి

  • సీఎంకు కృతజ్ఞతలు తెలిపిన ఉపాసన.. చిరంజీవి హర్షం

హైదరాబాద్‌, ఆగస్టు 4 (ఆంధ్రజ్యోతి): తెలంగాణ స్పోర్ట్స్‌ హబ్‌కు చైర్మన్‌గా ఆర్పీ సంజీవ్‌ గోయెంకా గ్రూప్‌ చైర్మన్‌ సంజీవ్‌ గోయెంకా నియమితులయ్యారు. వైస్‌ చైర్మన్‌గా ప్రముఖ నటుడు చిరంజీవి కోడలు కొణిదెల ఉపాసనను నియమించారు. ఈమేరకు స్పోర్ట్స్‌ హబ్‌ పాలకమండలిని నియమిస్తూ రాష్ట్రప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. మరో 14 మంది సభ్యులనూ నియమించింది. వీరిలో సన్‌టీవీ నెట్‌వర్క్‌కు చెందిన కావ్య మారన్‌, పుల్లెల గోపిచంద్‌ (బ్యాడ్మింటన్‌), రవికాంత్‌రెడ్డి (వాలీబాల్‌), బైచుంగ్‌ భుటియా (ఫుట్‌బాల్‌), అభినవ్‌ బింద్రా (షూటింగ్‌), కపిల్‌దేవ్‌ (క్రికెట్‌) తదితర ప్రముఖులు ఉన్నారు.


క్రీడాభివృద్ధి నిఽధిని సమర్థంగా ఉపయోగించుకునేందుకే ఈ పాలకమండలిని ఏర్పాటు చేసినట్టు ప్రభుత్వం పేర్కొంది. కాగా, తనను టీ స్పోర్ట్స్‌ హబ్‌కు వైస్‌చైర్మన్‌గా నియమించడంపట్ల సీఎం రేవంత్‌ రెడ్డికి ఉపాసన కృతజ్ఞతలు తెలిపారు. సంజీవ్‌ గోయెంకాతో కలిసి పనిచేసే అవకాశంరావడం మరింత గౌరవంగా భావిస్తున్నట్లు ఎక్స్‌లో పోస్టు పెట్టారు. ఉపాసనకు స్పోర్ట్స్‌ హబ్‌ వైస్‌చైర్మన్‌ బాధ్యతలు అప్పగించడంపై చిరంజీవి హర్షం వ్యక్తం చేశారు. ‘మా కోడలు ఉపాసన ఇప్పుడు తెలంగాణ స్పోర్ట్స్‌ హబ్‌కు వైస్‌చైర్మన్‌. ఆమెను ఈ హోదాలో చూడడం సంతోషంగా ఉంది. డియర్‌ ఉపాసన.. నీకున్న నిబద్ధత, ప్యాషన్‌తో క్రీడల్లో దాగిన అపార ప్రతిభను గుర్తించి ప్రోత్సహిస్తారని, ప్రతిభావంతులను అగ్రస్థానంలో నిలబెట్టడానికి తగిన విధివిధానాలను రూపొందించడంలో నీ వంతు కృషి చేస్తావని ఆశిస్తున్నా’ అంటూ ఎక్స్‌లో పోస్టు చేశారు.


ఈ వార్తలు కూడా చదవండి..

కాళేశ్వరం నివేదికపై ఆరోపణలు.. బీఆర్ఎస్ పార్టీ సంచలన నిర్ణయం

కవితకు షాక్ ఇచ్చిన కోర్టు

Read latest Telangana News And Telugu News

Updated Date - Aug 05 , 2025 | 03:51 AM