Ramcharan: ఆర్చరీ ప్రీమియర్ లీగ్.. ప్రధాని మోదీని కలిసిన రామ్ చరణ్
ABN , Publish Date - Oct 11 , 2025 | 09:04 PM
ఆదివారం నాడు ఆర్చరీ ప్రీమియర్ లీగ్ ఫినాలే జరగనున్న నేపథ్యంలో టోర్నీ బ్రాండ్ అంబాసిడర్ రామ్ చరణ్ సతీ సమేతంగా ప్రధాని నరేంద్ర మోదీని కలిశారు. ఆయన మార్గదర్శకత్వంలో ప్రపంచవ్యాప్తంగా విలువిద్యకు మరింత ప్రోత్సాహం లభిస్తోందని అన్నారు.
ఢిల్లీ: టాలీవుడ్ స్టార్ హీరో రామ్ చరణ్ బ్రాండ్ అంబాసిడర్‌గా ఉన్న ఆర్చరీ ప్రీమియర్ లీగ్(APL) ఆదివారంతో ముగుస్తుంది. ప్రపంచంలోనే మొట్టమొదటి ప్రొఫెషనల్ ఆర్చరీ లీగ్‌గా ఏపీఎల్‌కు పేరుంది. రేపే ఏపీఎల్ గ్రాంఢ్ ఫినాలే. ఈ నేపథ్యంలో రామ్ చరణ్, తన సతీమణి ఉపాసనతో కలిసి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని మర్యాదపూర్వకంగా కలిశారు. రామ్ చరణ్ వెంట ఉపాసన తండ్రి అనీల్ కామినేని కూడా ఉన్నారు. ఈ సందర్భంగా ప్రధానికి శ్రీ వేంకటేశ్వరస్వామి విగ్రహాన్ని రామ్ చరణ్ బహూకరించారు.
ఈ సమావేశం విశేషాలను రామ్ చరణ్ నెట్టింట పంచుకున్నారు. ఆర్చరీ ప్రీమియర్ లీగ్ విజయవంతంగా సాగుతున్న నేపథ్యంలో ప్రధానిని కలిసినట్టు తెలిపారు. ప్రధానికి క్రీడలపై ఉన్న ఆసక్తి, ఆయన మార్గదర్శకత్వం తమకు ఎంతో స్ఫూర్తినిచ్చిందని.. ఆర్చరీని ప్రపంచవ్యాప్తంగా ప్రోత్సహించడంలో తోడ్పాటును అందిస్తోందని కామెంట్ చేశారు. ఈ లీగ్‌లో పాల్గొన్న క్రీడాకారులందరినీ రామ్ చరణ్ అభినందించారు. శారీరక, మానసిక వికాసానికి క్రీడలు ఉపకరిస్తాయని.. మరింత మంది ఆర్చరీ ప్రీమియర్ లీగ్‌లో పాల్గొనాలని ఆశిస్తున్నట్టు తెలిపారు.
ఆర్చరీ అసోసియేషన్ ఆఫ్ ఇండియా సారథ్యంలో తొలిసారిగా దేశంలో ఈ ఫ్రాంచైజ్ ఆధారిత టోర్నీ జరుగుతోంది. ఇందులో ఆరు టీమ్స్ పాల్గొంటున్నాయి. ఒక్కో టీమ్‌లో నలుగురు పురుషులు, నలుగురు మహిళా క్రీడాకారులు ఉన్నారు. రీకర్వ్, కాంపౌండ్ స్పెషలిస్టులూ ఉంటారు. 36 మంది భారతీయ క్రీడాకారులతోపాటు, 12మంది అంతర్జాతీయ క్రీడాకారులూ ఈ టోర్నీలో పాలు పంచుకుంటున్నారు. రేపు జరుగనున్న సీజన్ ఫినాలేలో రాజ్‌పుతానా రాయల్స్, మైఠీ మరాఠాస్ తలపడనున్నాయి. ఢీల్లీలోని యమునా స్పోర్ట్స్ కాంప్లెక్స్‌లో ఈ టోర్నీ జరుగుతోంది.
ఇవి కూడా చదవండి:
Prashant Kishore: రాహుల్ తరహాలోనే తేజస్వి ఓడిపోతారు.. ప్రశాంత్ కిశోర్ జోస్యం
Mamata Banerjee: బెంగాల్ సీఈఓకు మమతా బెదిరింపులు.. ఈసీ సీరియస్
మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి