Mamata Banerjee: బెంగాల్ సీఈఓకు మమతా బెదిరింపులు.. ఈసీ సీరియస్
ABN , Publish Date - Oct 11 , 2025 | 07:52 PM
బెంగాల్ సీఈఓ మనోజ్ అగర్వాల్ హద్దులు దాడితే ఆయనపై ఉన్న 'అవినీతి ఆరోపణలు' బయటపెడతామని ఒక సమావేశంలో మమతా బెనర్జీ పేర్కొన్నట్టు సమాచారం. ఈ సమావేశానికి రాష్ట్ర చీఫ్ సెక్రటరీ మనోజ్ పంత్, మంత్రి అరూప్ బిశ్వాస్ కూడా హాజరైనట్టు తెలుస్తోంది.
కోల్‌కతా: పశ్చిమబెంగాల్ చీఫ్ ఎలక్టోరల్ అధికారి (CEO)ని ముఖ్యమంత్రి మమతా బెనర్జీ (Mamata Banerjee) బెదిరిస్తూ వ్యాఖ్యలు చేశారంటూ వార్తలు రావడాన్ని కేంద్ర ఎన్నికల సంఘం (EC) తీవ్రంగా పరిగణించింది. ముఖ్యమంత్రి వ్యాఖ్యలకు సంబంధించిన వీడియో కావాలని ఈసీ అడిగినట్టు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి.
బెంగాల్ సీఈఓ మనోజ్ అగర్వాల్ హద్దులు దాడితే ఆయనపై ఉన్న 'అవినీతి ఆరోపణలు' బయటపెడతామని ఒక సమావేశంలో మమతా బెనర్జీ పేర్కొన్నట్టు సమాచారం. ఈ సమావేశానికి రాష్ట్ర చీఫ్ సెక్రటరీ మనోజ్ పంత్, మంత్రి అరూప్ బిశ్వాస్ కూడా హాజరైనట్టు తెలుస్తోంది. రాష్ట్ర అధికారులను కూడా సీఈఓ బెదిరించినట్టు ముఖ్యమంత్రి ఈ సమావేశంలో ఆరోపించారని చెబుతున్నారు. 2011లో మమతా బెనర్జీ అధికారం చేపట్టినప్పటి నుంచి రాష్ట్ర పోలింగ్ అధికారిపై ఇలాంటి తీవ్ర ఆరోపణలు చేయడం ఇదే మొదటిసారి.
ముఖ్యమంత్రి వ్యాఖ్యల వీడియోను శనివారం సాయంత్రంలోగా తమకు పంపాలని సీఈఓ కార్యాలయాన్ని ఈసీ ఆదేశించినట్టు కోల్‌కతా సీఈఓ కార్యాలయ వర్గాలు తెలిపాయి. రాష్ట్ర ఎన్నికల అధికారిని బెదిరించిన ముఖ్యమంత్రిపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని అసెంబ్లీలో బీజేపీ విపక్ష నేత సువేందు అధికారి ఎన్నికల కమిషన్‌కు ఇప్పటికే ఒక లేఖ సమర్పించారు. సీఈఓపై మమతాబెనర్జీ చేసిన ఆరోపణలను బహిర్గతం చేయాలని, లేకుంటే సీఎంపై చర్యలు తీసుకునేంత వరకూ ఈసీ కార్యాలయం వెలుపల తమ పార్టీ నిరవధిక నిరసన చేపడుతుందని సువేందు అధికారి హెచ్చరించారు.
ఇవి కూడా చదవండి..
యువ వ్యాపారి గుప్తా హత్య కేసులో పూజా శకున్ పాండే అరెస్టు
నా సమయం ఎప్పుడొస్తుందో నాకు తెలుసు.. సీఎం ఊహాగానాలపై డీకే
Read Latest Telangana News and National News