DK Shivakumar: నా సమయం ఎప్పుడొస్తుందో నాకు తెలుసు.. సీఎం ఊహాగానాలపై డీకే
ABN , Publish Date - Oct 11 , 2025 | 03:39 PM
నాయకత్వ మార్పు కోరుతూ బహిరంగంగా వ్యాఖ్యలు చేస్తున్న కొందరు కాంగ్రెస్ నేతలను శివకుమార్ ఇటీవల హెచ్చరించారు. సీఎం మార్పు గురించి మాట్లాడే వారికి నోటీసులు ఇవ్వాలని కేపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్‌ను ఆదేశించినట్టు ఆయన చెప్పారు.
బెంగళూరు: కర్ణాటకలో కొద్దికాలంగా ముఖ్యమంత్రి మార్పు జరుగనుందంటూ వస్తున్న ఊహాగానాలపై కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ (DK Shivakumar) శనివారంనాడు స్పందించారు. తాను పార్టీకి కట్టుబడి ఉన్నానని, అయితే కొంత మంది దీనిపై గందరగోళం సృష్టించే ప్రయత్నం చేస్తున్నారని అసంతృప్తి వ్యక్తం చేశారు. నాయకత్వం అంశంపై తానెలాంటి వ్యాఖ్యలు చేసింది లేదని చెప్పారు. తనకెలాంటి తొందర లేదని అన్నారు.
'నాయకత్వం అంశంపై నేను ఎప్పుడూ మాట్లాడింది లేదు. కొందరిలో అవగాహనా లోపం ఉంది. మంచి రోజులు రాబోతున్నాయని కొందరు అన్నప్పుడు వేచిచూడండని చెప్పాను. ఆ మాటలపై కొందరు మీడియా వ్యక్తులు గందరగోళం సృష్టిస్తున్నారు. మీరెవరూ గందరగోళానికి గురికావద్దు. నా సమయం ఎప్పుడొస్తుందనేది నాకు బాగా తెలుసు. 2028లో తిరిగి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఇక్కడ అధికారంలోకి తీసుకు రావడమే నా పని. అదే నా ప్రాధాన్యత కూడా' అని డీకే చెప్పారు.
నాయకత్వ మార్పు కోరుతూ బహిరంగంగా వ్యాఖ్యలు చేస్తున్న కొందరు కాంగ్రెస్ నేతలను శివకుమార్ ఇటీవల హెచ్చరించారు. సీఎం మార్పు గురించి మాట్లాడే వారికి నోటీసులు ఇవ్వాలని కేపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్‌ను ఆదేశించినట్టు ఆయన చెప్పారు. సీఎం పోస్ట్ షేరింగ్‌పై చర్చించాల్సిన అవసరం లేదన్నారు. సిద్ధరామయ్య, తాను కలిసి పనిచేస్తున్నామని, అధిష్ఠానం ఆదేశాలను తాము తు.చ. తప్పకుండా పాటిస్తున్నామని తెలిపారు.
ఇవి కూడా చదవండి..
రైతుల శ్రేయస్సు కోసం లెక్కలేనన్ని సంస్కరణలు తెచ్చాం.. ప్రధాని మోదీ
రైతుల కోసం మోదీ ప్రభుత్వం కొత్త పథకం.. నేటి నుంచి షురూ!
Read Latest Telangana News and National News