Share News

Air India Flight: రన్ వేపై ఆగిపోయిన ఎయిర్ ఇండియా విమానం.. 3 గంటలు అవుతున్నా..

ABN , Publish Date - Aug 04 , 2025 | 01:19 PM

Air India Flight: విమానంలో ఏపీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బట్టు దేవానంద్ కూడా ఉన్నారు. 164 మంది ప్రయాణికుల్లో కొంతమందికి డయాబెటిస్, ఇతర వ్యాధులు ఉన్నాయని.. వారికి ఆహారం, నీరు ఇవ్వాలని ఆయన విమాన సిబ్బందిని ఆదేశించారు.

Air India Flight: రన్ వేపై ఆగిపోయిన ఎయిర్ ఇండియా విమానం.. 3 గంటలు అవుతున్నా..
Air India Flight

దేశ రాజధాని ఢిల్లీ నుంచి విజయవాడ బయలుదేరిన ఎయిర్ ఇండియా విమానం ఆలస్యం అయింది. ఎయిర్ ఇండియా ఎటువంటి కారణం చెప్పకుండా విమానాన్ని రన్ వే పైనే నిలిపివేసింది. ఉదయం 9.30 గంటల ప్రాంతంలో బయలుదేరాల్సిన విమానం ఇంకా రన్ వే పైనే ఉండిపోయింది. విమానం టేక్ ఆఫ్ అవ్వడానికి సిద్ధమై ఆ వెంటనే రన్ వే పై ఆగిపోయింది. దాదాపు 3 గంటలు అవుతున్నా విమానం అక్కడినుంచి కదలలేదు. దీంతో ప్రయాణికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.


ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయకపోవడంతో మండిపడుతున్నారు. విమానంలో ఏపీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బట్టు దేవానంద్ కూడా ఉన్నారు. 164 మంది ప్రయాణికుల్లో కొంతమందికి డయాబెటిస్, ఇతర వ్యాధులు ఉన్నాయని.. వారికి ఆహారం, నీరు ఇవ్వాలని ఆయన విమాన సిబ్బందిని ఆదేశించారు. న్యాయమూర్తి ఆదేశాల మేరకు విమాన సిబ్బంది ప్రయాణికులకు ఆహారం, నీరు అందించారు. అయితే, సాంకేతిక సమస్యల వల్లే విమానం ఆగిపోయిందని ఎయిర్ ఇండియా చెబుతోంది. ప్రయాణికులు తమకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని కోరుతున్నారు.


ఇవి కూడా చదవండి

మార్నింగ్ వాక్‌లో మహిళా ఎంపీ.. మెడలో చైన్ కొట్టేసిన దొంగ..

జనం చూస్తుండగానే సముద్రంలో కుప్పకూలిన మినీ విమానం

Updated Date - Aug 04 , 2025 | 02:06 PM