Air India : ఎయిర్ ఇండియా కనిష్క విమానం పేలుడు అనుమానితుడిని చంపిన వ్యక్తికి జీవిత ఖైదు
ABN , Publish Date - Jan 30 , 2025 | 04:19 AM
1985లో ఎయిర్ ఇండియా కనిష్క విమానం బాంబు పేలుడు ఘటనలో అనుమానితుడు రిపుదమన్ సింగ్ మాలిక్‌ను హతమార్చిన కేసులో టనెర్ ఫాక్స్‌కు బ్రిటిష్ కొలంబియా సుప్రీంకోర్టు జీవిత ఖైదు విధించింది.

న్యూఢిల్లీ, జనవరి 29: 1985లో ఎయిర్ ఇండియా కనిష్క విమానం బాంబు పేలుడు ఘటనలో అనుమానితుడు రిపుదమన్ సింగ్ మాలిక్‌ను హతమార్చిన కేసులో టనెర్ ఫాక్స్‌కు బ్రిటిష్ కొలంబియా సుప్రీంకోర్టు జీవిత ఖైదు విధించింది. ఈ కేసులో ఫాక్స్‌తోపాటు సహ నిందితుడిగా ఉన్న జోస్ లోపెజ్‌పై గత అక్టోబరులో నేరనిర్ధారణ జరిగింది. తాము డబ్బులు తీసుకుని మాలిక్‌ను హత్య చేసినట్టు వీరు అంగీకరించారు. డబ్బు ఎవరు ఇచ్చింది మా త్రం వెల్లడించలేదు. లోపెజ్‌కు శిక్ష ఖరారుచేయాల్సి ఉంది. 1985లో ఎయిర్ ఇండియా విమానాన్ని బాంబుతో పేల్చివేయడంతో 329 మంది చనిపోయారు.