ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Weather: ఉదయం ఎండ .. సాయంత్రం వాన

ABN, Publish Date - Apr 08 , 2025 | 05:29 AM

రాష్ట్రంలో భిన్న వాతావరణ పరిస్థితులు నెలకొన్నాయి. మధ్యాహ్నం వరకు ఎండ తీవ్రతతో జనం ఉక్కిరి బిక్కిరి అవుతుండగా, సాయంత్రం ఉన్నట్టుండి వాతావరణం చల్లబడి వర్షం కురుస్తోంది.

  • రాష్ట్రంలో భిన్న వాతావరణ పరిస్థితి

  • పలు జిల్లాల్లో గాలి వాన బీభత్సం

  • నేడు, రేపు పలు జిల్లాలకు వర్షసూచన

(ఆంధ్రజ్యోతి న్యూస్‌ నెట్‌వర్క్‌): రాష్ట్రంలో భిన్న వాతావరణ పరిస్థితులు నెలకొన్నాయి. మధ్యాహ్నం వరకు ఎండ తీవ్రతతో జనం ఉక్కిరి బిక్కిరి అవుతుండగా, సాయంత్రం ఉన్నట్టుండి వాతావరణం చల్లబడి వర్షం కురుస్తోంది. సోమవారం నిజామాబాద్‌ జిల్లాలో అత్యధికంగా 42.5 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదైంది. కాగా, మధ్యాహ్నం నుంచి మహబూబాబాద్‌, హనుమకొండ, వరంగల్‌, జనగామ, భూపాలపల్లి, ములుగు, మహబూబాబాద్‌ జిల్లాలోని పలు గ్రామాల్లో గాలివాన బీభత్సం సృష్టించింది. ఖమ్మం జిల్లాల్లో వడగళ్ల వాన కురవడంతో మామిడి తోటల్లో కాయలు నేలరాలాయి.


మరోవైపు దక్షిణ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వల్ల రాగల 48 గంటల్లో రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో మంగళ, బుధవారాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణశాఖ అధికారులు తెలియజేశారు. కాగా, ఆగ్నేయ బంగాళాఖాతంలో ఉన్న ఉపరితల ఆవర్తనం ప్రభావంతో మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం బలపడే అవకాశం లేదని వాతావరణ నిపుణుడొకరు తెలిపారు.

Updated Date - Apr 08 , 2025 | 05:29 AM