ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Rain: ఏపీలో గాలివాన బీభత్సం

ABN, Publish Date - May 05 , 2025 | 04:23 AM

మండువేసవిలో ఆంధ్రప్రదేశ్‌ను అకాలవర్షం అతలాకుతలం చేసింది. ఉరుములు, మెరుపులు, వడగళ్లు, పిడుగులు, ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం పలు ప్రాంతాల్లో బీభత్సం సృష్టించింది.

మండువేసవిలో భారీవర్షంతో అతలాకుతలం

  • వడగండ్లు, పిడుగులు, ఈదురుగాలుల హోరు

  • పిడుగులు పడి ఆరుగురి మృతి

  • చెట్టు కూలి బాలుడు, విదుద్ఘాతంతో మరొకరు

  • వేలాది ఎకరాల్లో మామిడి, వరి పంటలకు నష్టం

(ఆంధ్రజ్యోతి న్యూస్‌నెట్‌వర్క్‌): మండువేసవిలో ఆంధ్రప్రదేశ్‌ను అకాలవర్షం అతలాకుతలం చేసింది. ఉరుములు, మెరుపులు, వడగళ్లు, పిడుగులు, ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం పలు ప్రాంతాల్లో బీభత్సం సృష్టించింది. పిడుగులు పడి ఆరుగురు, గాలివాన ధాటికి చెట్టు కూలి ఓ బాలుడు, విద్యుద్ఘాతంతో మరొకరు మరణించారు. పెనుగాలులు, భారీ వర్షానికి వేలాది ఎకరాల్లో మామిడి, వరి, బొప్పాయి, మొక్కజొన్న, అరటి పంటలు దెబ్బతిన్నాయి. ముఖ్యంగా మామిడి, వరి రైతులకు భారీ నష్టం వాటిల్లింది. ఈదురుగాలులకు చాలా చోట్ల భారీ వృక్షాలు, చెట్లు, విద్యుత్‌ స్తంభాలు పడిపోయాయి. దీంతో విద్యుత్‌ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. భారీ వర్షాలకు లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. వర్షపు నీరు భారీగా రోడ్లపై నిలవడంతో వాహనదారులు ఇబ్బంది పడ్డారు. ఉభయగోదావరి, కృష్ణా, గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో గంటకు 40-50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులతో భారీవర్షం పడింది. కాకినాడ, ఏలూరు, కోనసీమ జిల్లాల్లో వాన దంచి కొట్టింది. కాకినాడ జిల్లా కాజులూరులో అత్యధికంగా 105 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. 130 చోట్ల 20 మిల్లీమీటర్ల కన్నా అధికంగా వానపడింది. గోదావరి జిల్లాల్లో వేలాది ఎకరాల్లో అరటి, కొబ్బరి, బొప్పాయి తోటలు దెబ్బతిన్నాయి. కృష్ణా, గోదావరి డెల్టా ప్రాంతాల్లో రోడ్లపై ఆరబోసిన ధాన్యం తడిసింది. ఎన్టీఆర్‌, ఏలూరు జిల్లాల్లో మామిడి పంటకు అపార నష్టం వాటిల్లింది. ఏలూరు, కాకినాడ, ఎన్టీఆర్‌, గుంటూరు జిల్లాల్లో చాలా చోట్ల చెట్లు విరిగిపడ్డాయి. హోర్డింగ్‌లు పడిపోయాయి. విజయవాడ సహా పలు నగరాల్లో పల్లపు ప్రాంతాలు జలమయయ్యాయి.


మృత్యువాత..

తిరుపతి జిల్లాలో మధ్యాహ్నం 12 గంటల ప్రాంతంలో ఈదురుగాలులతో పాటు మెరుపులు, ఉరుములతో భారీ వర్షం కురిసింది. నాయుడుపేట మండలం వద్దిగుంట కండ్రిగ గ్రామానికి చెందిన భాస్కర్‌ (50), ఓజిలి మండలం గ్రద్దగుంట పంచాయతీ గొల్లపాలెం వద్ద కార్తీక్‌ అనే బాలుడు, నెల్లూరు జిల్లా రాపూరు మండలం రావిగుంటపల్లికి చెందిన తాటి బోయిన చిన్నయ్య (50)పిడుగు పాటుకు గురై మృతి చెందారు. బాపట్ల జిల్లా కొల్లూరు మండలం పరిధిలోని గాజుల్లంక గాలు మార్గంలో పిడుగుపడి మాతంగి సుప్రదీప్‌(23) దుర్మరణం పాలయ్యాడు. మరో వ్యక్తి స్వల్పగాయాలతో బయటపడ్డాడు. పర్చూరు నియోజకవర్గం చిన్నగంజాంలోని కొమ్మమూరు కాలువ వద్ద గొర్రెల కాపరి గడ్డం బ్రహ్మయ్య (47)పై పిడుగు పడటంతో అక్కడికక్కడే మృతిచెందాడు. ఏలూరు జిల్లా ముసునూరు మండలం చెక్కపల్లిలో ఇంటిపై వెలగచెట్టు విరిగిపడడంతో మామిడి బాలగోవింద్‌ (12) అనే బాలుడు మృతి చెందగా, అతని తండ్రి మారేశు తీవ్రంగా గాయపడ్డాడు. దెందులూరులో ఇంటిముందు విద్యుత్‌ సర్వీస్‌ వైరు తెగి పడటంతో విద్యుద్ఘాతానికి గురై తానికొండ జార్జి (53) మృతి చెందాడు. మండవల్లి మండలం దెయ్యంపాడులో సైదు గిరిబాబు (33) రొయ్యల చెరువు వద్ద మేత మేస్తుండగా పిడుగు పడి మృతి చెందాడు. ఏపీలో రెండు రోజులపాటు భిన్న వాతావరణం ఉంటుందని.. కొన్ని చోట్ల 41-42 డిగ్రీల ఉష్ణోగ్రతలు, మరికొన్ని చోట్ల ఈదురు గాలులతో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది.


ఈ వార్తలు కూడా చదవండి:

CM Revanth Reddy: సీఎం రేవంత్ రెడ్డికి తప్పిన ప్రమాదం.. అసలు విషయం ఇదే..

AP Liquor Scam: మాజీ ఎంపీ విజయసాయిరెడ్డికి షాక్.. ఆ కేసులో నోటీసులు జారీ..

Supreme Court: వివేకా హత్య కేసు..ఉదయ్ కుమార్ రెడ్డికి సుప్రీం నోటీసులు..

Updated Date - May 05 , 2025 | 04:23 AM