ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Ponguleti: రెవెన్యూ మంత్రి పేరిట వసూళ్లు.. ఇద్దరి అరెస్ట్‌

ABN, Publish Date - Apr 26 , 2025 | 04:44 AM

రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివా్‌సరెడ్డి పేరు చెప్పి మోసాలకు పాల్పడుతున్న ఇద్దరు వ్యక్తులను పోలీసులు శుక్రవారం అరెస్టు చేశారు. వరంగల్‌ జిల్లాకు చెందిన బుస్సా వెంకటరెడ్డి, మచ్చ సురేష్‌..

  • అక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు: పొంగులేటి

రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివా్‌సరెడ్డి పేరు చెప్పి మోసాలకు పాల్పడుతున్న ఇద్దరు వ్యక్తులను పోలీసులు శుక్రవారం అరెస్టు చేశారు. వరంగల్‌ జిల్లాకు చెందిన బుస్సా వెంకటరెడ్డి, మచ్చ సురేష్‌.. కొంత కాలంగా పొంగులేటి వద్ద వ్యక్తిగత సహాయకులమని చెప్పుకొంటూ అక్రమాలకు పాల్పడుతున్నారు. తహసీల్దార్లు, ఆర్డీవోలు, పోలీసులకు ఫోన్లు చేసి బెదిరించడమే కాకుండా.. కొంతమంది వద్ద డబ్బు వసూలు చేశారు. ఈ విషయం మంత్రి దృష్టికి రాగా.. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు.


విచారణ చేపట్టిన పోలీసులు.. నాగోలులో నివాసం ఉంటున్న వారిద్దరినీ అరెస్టు చేశారు. తన వ్యక్తిగత సహాయకులమనే పేరుతో ఎవరైనా ఫోన్‌ చేసినా, చిన్న అనుమానం తలెత్తినా సచివాలయంలోని తన కార్యాలయ నంబర్లకు(040-234541072, 040-23451073) ఫోన్‌ చేసి ఫిర్యాదు చేయాలని మంత్రిపొంగులేటి సూచించారు. తన పేరును వాడుకొని అక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.

Updated Date - Apr 26 , 2025 | 04:44 AM