ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Swecha Votarkar: న్యూస్‌ యాంకర్‌ స్వేచ్ఛ అనుమానాస్పద మృతి

ABN, Publish Date - Jun 28 , 2025 | 03:59 AM

ప్రముఖ టీవీ చానల్‌లో న్యూస్‌ యాంకర్‌గా పని చేస్తున్న స్వేచ్ఛ వొటార్కర్‌ (40) అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు.

చిక్కడపల్లి, జూన్‌ 27 (ఆంధ్రజ్యోతి): ప్రముఖ టీవీ చానల్‌లో న్యూస్‌ యాంకర్‌గా పని చేస్తున్న స్వేచ్ఛ వొటార్కర్‌ (40) అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. ఆర్టీసీ క్రాస్‌ రోడ్డు జవహర్‌నగర్‌లోని షాలం లతా నిలయంలోని పెంట్‌హౌ్‌సలో నివాసముంటున్న స్వేచ్ఛ చనిపోయారంటూ పోలీసులకు శుక్రవారం రాత్రి 9.20 గంటల సమయంలో సమాచారం అందింది. ఈ మేరకు అక్కడికి వెళ్లి చూడగా.. స్వేచ్ఛ ఫ్యాన్‌కు వేలాడుతూ కనిపించారని పోలీసులు తెలిపారు. రాత్రి 8.30 గంటల సమయంలో ఆమె చనిపోయి ఉంటారని ప్రాథమికంగా అంచనా వేశారు.

ఆమె మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు. గతంలో తన తల్లిదండ్రులు శ్రీదేవి, శంకర్‌తో కలిసి పార్సిగుట్టలోని వైఎ్‌సఆర్‌ పార్కు సమీపంలో నివాసమున్న స్వేచ్ఛ.. గత నాలుగేళ్లుగా కూతురు(14)తో కలిసి వేరుగా ఉంటున్నారు. జర్నలిస్ట్‌ హౌసింగ్‌ సొసైటీ ఎన్నికల్లో కమిటీ సభ్యురాలిగా ఎన్నికయ్యారు. స్వేచ్ఛ మృతిపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్టు చిక్కడపల్లి ఇన్‌స్పెక్టర్‌ రాజునాయక్‌ తెలిపారు.

Updated Date - Jun 28 , 2025 | 03:59 AM