Tummala: ‘మహిళా శక్తి’ చీరల ఉత్పత్తిని పెంచాలి
ABN, Publish Date - Jul 11 , 2025 | 04:21 AM
అన్ని ప్రభుత్వ శాఖలు, కార్పొరేషన్ల నుంచి వచ్చే సంవత్సరానికి అవసరమయ్యే వస్ర్తాల కోసం సెప్టెంబరు నెలలోగానే ఆర్డర్లు తెప్పించుకోవాలని, ఇప్పటికే ఉన్న ఆర్డర్లను టెస్కో త్వరితగతిన పూర్తి చేయాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆదేశించారు.
ప్రభుత్వ శాఖల ఆర్డర్లను ముందే టెస్కోకు ఇవ్వాలి
చేనేత కార్మికులకు పని కల్పించాలి: మంత్రి తుమ్మల
హైదరాబాద్, జులై 10 (ఆంధ్రజ్యోతి): అన్ని ప్రభుత్వ శాఖలు, కార్పొరేషన్ల నుంచి వచ్చే సంవత్సరానికి అవసరమయ్యే వస్ర్తాల కోసం సెప్టెంబరు నెలలోగానే ఆర్డర్లు తెప్పించుకోవాలని, ఇప్పటికే ఉన్న ఆర్డర్లను టెస్కో త్వరితగతిన పూర్తి చేయాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆదేశించారు. కార్మికులకు ఏడాది పొడవునా పని కల్పించాలని, స్వయం సహాయక సంఘాల మహిళలకు అందచేసే మహిళాశక్తి చీరల ఉత్పత్తిని వేగవంతం చేయాలని సూచించారు.
సచివాలయంలో గురువారం చేనేత, జౌళి శాఖపై నిర్వహించిన సమీక్షలో ఆయన మాట్లాడారు. చేనేత కార్మికుల వ్యక్తిగత రుణాల వెరిఫికేషన్ ప్రక్రియ పూర్తి చేసి, కార్మికుల ఖాతాల్లో నిధులు జమ చేయాలని, టెస్కో షోరూమ్‌లను మెరుగుపరిచి లాభాల బాటలో నడిపించడానికి తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. కాగా, జాతీయ చేనేత పురస్కారానికి ఎంపికైన గజం నర్మద, గూడ పవన్‌ను మంత్రి తుమ్మల సన్మానించారు.
Updated Date - Jul 11 , 2025 | 04:21 AM