TGSRTC: హైదరాబాద్ - విజయవాడ బస్సు టిక్కెట్‌పై 8% రాయితీ
ABN, Publish Date - Jun 21 , 2025 | 03:23 AM
హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్లే ప్రయాణికులకు తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(టీజీఎస్ ఆర్టీసీ) టిక్కెట్ ధరపై రాయితీ కల్పిస్తుంది.
టీజీఎస్ ఆర్టీసీ ‘రాజధాని’ ఏసీ సర్వీసుల్లో అవకాశం
హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్లే ప్రయాణికులకు తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(టీజీఎస్ ఆర్టీసీ) టిక్కెట్ ధరపై రాయితీ కల్పిస్తుంది. హైదరాబాద్ నుంచి విజయవాడ రూట్‌లో నడిచే రాజధాని ఏసీ బస్సు టికెట్ ధరపై 8శాతం రాయితీ ఇస్తున్నామని ప్రకటించింది. ప్రయాణికులు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని టీజీఎస్ ఆర్టీసీ అధికారులు ఓ ప్రకటన చేశారు. కాగా ఇప్పటికే హైదరాబాద్ నుంచి బెంగళూరు, ఇతర మార్గాల్లోనూ బస్సు టిక్కెట్ ధరలపై రాయితీ అమలు చేస్తున్నామని ఆర్టీసీ అధికారులు పేర్కొన్నారు.
Updated Date - Jun 21 , 2025 | 03:23 AM