ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Sangareddy: రెండు కార్లపై కట్టెల లోడ్‌ లారీ బోల్తా

ABN, Publish Date - May 05 , 2025 | 04:45 AM

కట్టెల లోడ్‌తో వెళ్తున్న ఓ లారీ రెండు కార్లపై బోల్తా పడడంతో ఇద్దరికి తీవ్రగాయాలు కాగా, ముగ్గురు ప్రమాదం నుంచి తప్పించుకున్నారు.

  • ఇద్దరికి గాయాలు, త్రుటిలో తప్పించుకున్న ముగ్గురు బాధితులకు హరీశ్‌ రావు సాయం

కొండాపూర్‌, మే 4 (ఆంధ్రజ్యోతి): కట్టెల లోడ్‌తో వెళ్తున్న ఓ లారీ రెండు కార్లపై బోల్తా పడడంతో ఇద్దరికి తీవ్రగాయాలు కాగా, ముగ్గురు ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. ఈ ఘటన ఆదివారం సంగారెడ్డి జిల్లా కొండాపూర్‌ మండలం మల్కాపూర్‌ సమీపంలో 65వ నెంబరు జాతీయ రహదారిపై జరిగింది. ఈ ప్రమాదంలో ఓ కారులో ప్రయాణిస్తున్న రంగారెడ్డి జిల్లా శంకర్‌పల్లికి చెందిన అరుణకు గాయాలు కాగా, ఆమె భర్త, ఇద్దరు కుమారులు త్రుటిలో తప్పించుకున్నారు.


మరో కారులో ప్రయాణిస్తున్న హైదరాబాద్‌కు చెందిన వ్యక్తికి గాయాలయ్యాయి. ప్రమాదం జరిగిన సమయంలో జహీరాబాద్‌ వెళ్తున్న ఎమ్మెల్యే హరీశ్‌రావు తన కాన్వాయ్‌ ఆపి సహాయక చర్యలు చేపట్టారు. స్థానికులు, సిబ్బందితో కలిసి కార్లలో ఇరుక్కుపోయిన వారిని బయటకు తీశారు. గాయపడిన ఇద్దరిని తన వాహనంలో ఎక్కించి ఆస్పత్రికి పంపించారు. ఎస్పీ, కలెక్టర్‌తో మాట్లాడి బాధితుల వైద్యానికి సాయం అందించాలని హరీశ్‌ రావు సూచించారు.

Updated Date - May 05 , 2025 | 04:45 AM