Mahesh Kumar Goud: ఉమ్మడి జిల్లాల వారీగా ఇన్‌చార్జ్‌ల నియామకం
ABN, Publish Date - Jul 08 , 2025 | 03:33 AM
ఈ నెలాఖరులోగా సంస్థాగత నిర్మాణం పూర్తి చేసేందుకు టీపీసీసీ కసరత్తులో మరో అడుగు పడింది.
క్షేత్రస్థాయి పార్టీ నిర్మాణంలో టీపీసీసీ మరో అడుగు
హైదరాబాద్, జూలై 7 (ఆంధ్రజ్యోతి): ఈ నెలాఖరులోగా సంస్థాగత నిర్మాణం పూర్తి చేసేందుకు టీపీసీసీ కసరత్తులో మరో అడుగు పడింది. గ్రామ స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు పార్టీ కమిటీలను ఏర్పాటు చేసేందుకు ఉమ్మడి జిల్లాల వారీగా ఇన్‌చార్జ్‌లను నియమిస్తూ సోమవారం టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ ఉత్తర్వులు ఇచ్చారు. ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే ఇటీవల ఇచ్చిన ఆదేశాల మేరకు ఆయన చర్యలు చేపట్టారు. పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జ్ మీనాక్షితో కలిసి మహేశ్‌గౌడ్.. ఈ పది మంది ఇన్‌చార్జ్‌లతో జూమ్ యాప్ ద్వారా సమావేశమయ్యారు. కమిటీల ఏర్పాటుకు సంబంధించి దిశానిర్దేశం చేశారు. ఇక ఈ ఇన్‌చార్జ్‌లకు తోడు కమిటీల నిర్మాణ ప్రక్రియలో పాలుపంచుకునేందుకు ఏఐసీసీ పరిశీలకులు రానున్నారు. వీరంతా కలిసి.. పార్టీ గ్రామ, బ్లాకు, మండల కమిటీల అధ్యక్షులు, కార్యవర్గాలను నియమించనున్నారు. జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్ష, కార్యవర్గ నియామకాలనూ పూర్తి చేయనున్నారు.
ఉమ్మడి జిల్లాల వారీగా ఇన్‌చార్జ్‌లు వీరే..
ఖమ్మం-ఏఐసీసీ కార్యదర్శి చల్లా వంశీచంద్‌రెడ్డి, నల్లగొండ-ఏఐసీసీ కార్యదర్శి సంపత్‌కుమార్, వరంగల్-మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్, మెదక్ -మంత్రి పొన్నం ప్రభాకర్, హైదరాబాద్-టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ తూర్పు జగ్గారెడ్డి, మహబూబ్‌నగర్-రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యుడు జెట్టి కుసుమ్‌కుమార్, ఆదిలాబాద్-ఎంపీ అనిల్‌కుమార్ యాదవ్, కరీంనగర్-ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్, నిజామాబాద్-వక్ఫ్ బోర్డు చైర్మన్ అజ్మతుల్లా హుసేని, రంగారెడ్డి-స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ శివసేనారెడ్డి.
Updated Date - Jul 08 , 2025 | 03:33 AM