ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

స్థానిక ఎన్నికలపై చర్చే అజెండాగా.. నేడు టీపీసీసీ ‘రాజకీయ కమిటీ’ భేటీ

ABN, Publish Date - Jun 24 , 2025 | 04:31 AM

స్థానిక సంస్థల ఎన్నికలకు సన్నద్ధతే అజెండాగా మంగళవారం గాంధీభవన్‌లో టీపీసీసీ రాజకీయ వ్యవహారాలు, సలహా కమిటీల ఉమ్మడి భేటీ జరగనుంది.

  • హాజరుకానున్న సీఎం రేవంత్‌రెడ్డి

హైదరాబాద్‌, జూన్‌ 23 (ఆంధ్రజ్యోతి): స్థానిక సంస్థల ఎన్నికలకు సన్నద్ధతే అజెండాగా మంగళవారం గాంధీభవన్‌లో టీపీసీసీ రాజకీయ వ్యవహారాలు, సలహా కమిటీల ఉమ్మడి భేటీ జరగనుంది. ఇందులో స్థానిక సంస్థల ఎన్నికలకు సన్నద్ధతతో పాటుగా పార్టీ సంస్థాగత నిర్మాణం, ఏడాదిన్నర ప్రభుత్వ పాలనలో చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లడం, కులగణన, ఎస్సీ వర్గీకరణ అంశాలపైనా చర్చించనున్నారు. టీపీసీసీ చీఫ్‌ మహేశ్‌కుమార్‌ గౌడ్‌ అధ్యక్షతన జరిగే ఈ సమావేశానికి సీఎం రేవంత్‌రెడ్డి, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జ్‌ మీనాక్షి నటరాజన్‌, ఇరు కమిటీల సభ్యులూ పాల్గొననున్నారు. ముఖ్యంగా స్థానిక ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్‌ అమలు చేయడానికి సాంకేతికంగా ఇబ్బందులు ఏర్పడితే.. పార్టీ పరంగా బీసీలకు 42 శాతం టికెట్లు ఇచ్చే అంశంపైనా చర్చించి విధానపర నిర్ణయం తీసుకునే అవకాశమున్నట్లు చెబుతున్నారు. ఇక ఈ ఉమ్మడి భేటీ పూర్తయిన తర్వాత.. కొత్తగా నియమితులైన టీపీసీసీ ఉపాధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులకు నియామక పత్రాల అందజేయనున్నారు. అలాగే వివిధ పత్రికల్లో మహేశ్‌ గౌడ్‌ రాసిన వ్యాసాల సంకలనం.. ‘విధ్వంసం నుంచి వికాసం వైపు’ పుస్తక ఆవిష్కరణ కూడా జరగనుంది.

కొండా మురళి వివాదంపై విచారణకు కమిటీ!

  • నేడు క్రమశిక్షణా చర్యల కమిటీ భేటీలో స్పష్టత

హైదరాబాద్‌, జూన్‌ 23 (ఆంధ్రజ్యోతి): ఉమ్మడి వరంగల్‌ జిల్లా కాంగ్రెస్‌ నేతలపై ఆ పార్టీ నేత కొండా మురళి చేసిన వ్యాఖ్యలతో రేగిన వివాదంపై విచారణకు కమిటీని ఏర్పాటు చేసే యోచనలో టీపీసీసీ పెద్దలు ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ఈ వివాదానికి సంబంధించి ఇటు కొండా దంపతులపై పార్టీకి చెందిన ఐదుగురు ఎమ్మెల్యేలు.. సదరు నాయకులపై అటు కొండా అనుచరులు పరస్పరం ఫిర్యాదులు చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మంగళవారం గాంధీభవన్‌లో టీపీసీసీ క్రమశిక్షణా చర్యల అమలు కమిటీ సమావేశమవుతోంది. ఈ భేటీలో కమిటీ చైర్మన్‌ మల్లు రవి, సభ్యులతో పాటుగా పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జ్‌ మీనాక్షి నటరాజన్‌, టీపీసీసీ చీఫ్‌ మహేశ్‌ కుమార్‌గౌడ్‌ పాల్గొంటారు. సమావేశం తర్వాత కొండా మురళి వివాదంపై విచారణ కమిటీ ఏర్పాటుపై స్పష్టత రానున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి.

ఇవి కూడా చదవండి..

అనుకున్న లక్ష్యాలను సాధించిన ఆపరేషన్ సిందూర్

సీఎం సారూ.. స్కూలు సీటు కావాలి

For National News And Telugu News

Updated Date - Jun 24 , 2025 | 04:31 AM