ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

జపాన్‌ పర్యటనకు ముగ్గురు తెలంగాణ విద్యార్థులు ఎంపిక

ABN, Publish Date - Jun 14 , 2025 | 04:12 AM

జాతీయ స్థాయి సైన్స్‌ పరిశోధనల్లో సత్తా చాటిన ముగ్గురు తెలంగాణ విద్యార్థులు జపాన్‌ పర్యటనకు ఎంపికయ్యారు. జాతీయ స్థాయిలో మొత్తం 54 మంది విద్యార్థులు ఎంపికయ్యారు.

హైదరాబాద్‌, జూన్‌ 13 (ఆంధ్రజ్యోతి): జాతీయ స్థాయి సైన్స్‌ పరిశోధనల్లో సత్తా చాటిన ముగ్గురు తెలంగాణ విద్యార్థులు జపాన్‌ పర్యటనకు ఎంపికయ్యారు. జాతీయ స్థాయిలో మొత్తం 54 మంది విద్యార్థులు ఎంపికయ్యారు. వారిలో నారాయణపేట గురుకుల పాఠశాల విద్యార్థి ఏ.శివారెడ్డి, మంచిర్యాల జిల్లా శ్రీచైతన్య పాఠశాల విద్యార్థిని సాయి శ్రీవల్లి, కరీంనగర్‌ జిల్లా పరమిత హెరిటేజ్‌ స్కూల్‌ విద్యార్థిని శుభశ్రీ సాహు ఉన్నారు. వీరు ఈనెల 15 నుంచి 21 వరకు జపాన్‌లో పర్యటించనున్నారు. భారత్‌లోని యువ ఆవిష్కర్తలను ప్రోత్సహించాలన్న లక్ష్యంతో జపాన్‌ సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ ఎజెన్సీ (జెఎ్‌సటీ) ఈ కార్యక్రమాన్ని 2016 నుంచి నిర్వహిస్తోంది. ఇప్పటివరకు తెలంగాణ నుంచి 21 మంది విద్యార్థులు జపాన్‌లో పర్యటించారని రాష్ట్ర విద్యా పరిశోధన, శిక్షణ మండలి (ఎస్‌సీఈఆర్‌టీ) సంచాలకులు జి.రమేశ్‌ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు.

రూ.611 కోట్ల అగ్రిగోల్డ్‌ ఆస్తులు.. బాధితులకు అప్పగించేందుకు కోర్టు అనుమతి

హైదరాబాద్‌, జూన్‌ 13 (ఆంధ్రజ్యోతి): అగ్రిగోల్డ్‌ కంపెనీకి సంబంధించి గతంలో ఈడీ అటాచ్‌ చేసిన రూ.611 కోట్ల ఆస్తులను బాధితులకు అందించే ప్రక్రియకు నాంపల్లి కోర్టు అనుమతిచ్చింది. ఈ ఆస్తుల మార్కెట్‌ విలువ దాదాపు రూ.వెయ్యి కోట్లకు చేరిందని ఈడీ అధికారులు తెలిపారు. అగ్రి గోల్డ్‌ స్కామ్‌కు సంబంధించి ఇప్పటి వరకు ఈడీ జప్తు చేసిన రూ.3,950 కోట్ల ఆస్తులను బాధితులకు అప్పగించారు. బాధితులకు తిరిగి చెల్లించే ప్రక్రియలో మార్కెట్‌ విలువ ప్రకారం రూ.7,000 కోట్ల ఆస్తులను అప్పగించామని ఈడీ అధికారులు ఒక ప్రకటనలో పేర్కొన్నారు.

Updated Date - Jun 14 , 2025 | 04:12 AM