TGRSA: అర్హతలతో సంబంధం లేకుండా జీపీవోలుగా అవకాశాలు ఇవ్వండి
ABN, Publish Date - May 06 , 2025 | 05:15 AM
ఈ మేరకు ఉద్యోగ సంఘం నాయకులతో కలిసి భూపరిపాలన ప్రధాన కమిషనర్ నవీన్ మిత్తల్‌కు వినతి పత్రం అందజేశారు.
నవీన్ మిత్తల్‌ను కోరిన రెవెన్యూ ఉద్యోగుల సంఘం
హైదరాబాద్, మే 5 (ఆంధ్రజ్యోతి): అపార పని అనుభవం ఉన్న పూర్వపు వీఆర్‌వో, వీఆర్‌ఏలకు అర్హతలతో సంబంధం లేకుండా గ్రామ పాలనా అధికారులుగా(జీపీవో) పనిచేసే అవకాశం కల్పించాలని తెలంగాణ రెవెన్యూ ఉద్యోగుల సంఘం(టీజీఆర్‌ఎ్‌సఏ) అధ్యక్షుడు వి.లచ్చిరెడ్డి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ఉద్యోగ సంఘం నాయకులతో కలిసి భూపరిపాలన ప్రధాన కమిషనర్ నవీన్ మిత్తల్‌కు వినతి పత్రం అందజేశారు.
2018-19సంవత్సరంలో వీఆర్‌వోలుగా పదోన్నతులు పొందిన సుమారు 250 మంది ప్రస్తుతం వివిధ విభాగాల్లో పని చేస్తున్నారని అధికారులకు వివరించారు. సాంకేతిక కారణాలతో దరఖాస్తు చేసుకోలేకపోయిన వారికి మరో అవకాశం కల్పించాలని లచ్చిరెడ్డి విజ్ఞప్తి చేశారు.
Updated Date - May 06 , 2025 | 05:15 AM