ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

NTPC: ఎన్టీపీసీ విద్యుత్తు కొనుగోలుకు తెలంగాణ ఈఆర్‌సీ సమ్మతి

ABN, Publish Date - May 18 , 2025 | 05:09 AM

రామగుండంలో ఎన్టీపీసీ నిర్మించిన తెలంగాణ సూపర్‌ థర్మల్‌ పవర్‌ స్టేషన్‌లో 800 మెగావాట్ల సామర్థ్యం కలిగిన మూడో యూనిట్‌ నుంచి కరెంట్‌ కొనుగోలుకు తెలంగాణ విద్యుత్‌ నియంత్రణ మండలి(టీజీఈఆర్‌సీ) సమ్మతి తెలిపింది.

  • యూనిట్‌కు రూ.4.12గా అంచనా

  • సింగరేణి రెండో దశపై పిటిషన్‌ వెనక్కి

హైదరాబాద్‌, మే 17 (ఆంధ్రజ్యోతి): రామగుండంలో ఎన్టీపీసీ నిర్మించిన తెలంగాణ సూపర్‌ థర్మల్‌ పవర్‌ స్టేషన్‌లో 800 మెగావాట్ల సామర్థ్యం కలిగిన మూడో యూనిట్‌ నుంచి కరెంట్‌ కొనుగోలుకు తెలంగాణ విద్యుత్‌ నియంత్రణ మండలి(టీజీఈఆర్‌సీ) సమ్మతి తెలిపింది. ఈ మేరకు మండలి చైర్మన్‌ డాక్టర్‌ జస్టిస్‌ దేవరాజు నాగార్జున్‌ శనివారం ఉత్తర్వులు ఇచ్చారు. ఆ తర్వాత విద్యుత్‌ కొనుగోలు ఒప్పందం(పీపీఏ) చేసుకోవాలని కమిషన్‌ నిర్దేశించింది. తొలి దశలో 800 మెగావాట్ల సామర్థ్యం కలిగిన రెండు యూనిట్ల నుంచి కరెంట్‌ కొనుగోలు చేస్తున్నారు.


తాజాగా మూడో యూనిట్‌ నుంచి తొలి ఏడాది యూనిట్‌కు రూ.4.12 ధరతో కరెంట్‌ అందనుంది. ఇక సింగరేణి రెండో దశలో నిర్మించతలపెట్టిన 800 మెగావాట్ల ప్లాంట్ల నుంచి కరెంట్‌ కొనుగోలుపై పునఃపరిశీలన చేస్తామని డిస్కమ్‌లు కోరడంతో.. ఆ కేసుకు సంబంధించిన పిటిషన్‌పై కమిషన్‌ ఏ నిర్ణయం తీసుకోకుండా వెనక్కి తీసుకోవడానికి అనుమతినిచ్చింది. గుజరాత్‌లోని కచ్‌ జిల్లాలో ఎన్‌ఎల్‌ సీసీఐఎల్‌ నిర్మించిన 200మెగావాట్ల సోలార్‌ విద్యుత్‌ను కొనుగోలుకు ఈఆర్‌సీ ఆమోదం తెలిపింది. యూనిట్‌కు రూ.2.57కు కరెంట్‌ కొనుగోలు చేయనున్నారు.


ఇవి కూడా చదవండి

Operation Sindoor: సోషల్ మీడియాలో పాక్ తప్పుడు ప్రచారం.. వాస్తవాలు బయటపెట్టిన PIB

PIB Fact Check: 3 రోజుల పాటు ATMలు బంద్.. వైరల్ పోస్టుపై పీఐబీ ఫ్యాక్ట్ చెక్..

Read Latest Telangana News And Telugu News

Updated Date - May 18 , 2025 | 05:09 AM