ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Egg Supply: జోనల్‌ వ్యవస్థను రద్దు చేయాలి

ABN, Publish Date - May 18 , 2025 | 04:11 AM

రాష్ట్రంలోని అంగన్వాడీ కేంద్రాలకు కోడి గుడ్లు సరఫరా చేసే జోనల్‌ వ్యవస్థను రద్దు చేయాలని తెలంగాణ ఫౌల్ట్రీ ఫెడరేషన్‌ రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు మోహన్‌రెడ్డి, భాస్కర్‌రావు ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు.

  • తెలంగాణ ఫౌల్ట్రీ ఫెడరేషన్‌ డిమాండ్‌

బర్కత్‌పుర, మే 17 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలోని అంగన్వాడీ కేంద్రాలకు కోడి గుడ్లు సరఫరా చేసే జోనల్‌ వ్యవస్థను రద్దు చేయాలని తెలంగాణ ఫౌల్ట్రీ ఫెడరేషన్‌ రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు మోహన్‌రెడ్డి, భాస్కర్‌రావు ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. 33 జిల్లాలకు విడివిడిగా కోడి గుడ్ల టెండర్లను కేటాయించాలని కోరారు. బషీర్‌బాగ్‌లోని నేషనల్‌ ఎగ్‌ కో-ఆర్డినేషన్‌ కమిటీ కార్యాలయంలో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. రాష్ట్ర వ్యాప్తంగా ఫౌల్ట్రీ రైతులు 1,267 మందికిపైగా ఉండగా కేవలం అయిదుగురికి మాత్రమే టెండర్లు వచ్చేలా అధికారులు కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు.


గతంలో నాణ్యతలేని కోడి గుడ్లు సరఫరా చేసిన వారికే మళ్లీ టెండర్లు ఇస్తున్నారని విమర్శించారు. బర్‌ ్డ ఫ్లూ కారణంగా నష్టపోయిన ఫౌల్ట్రీ రైతులను ఆదుకోవాలని, టెండర్లలో అవకతవకలు జరగకుండా చర్యలు తీసుకోవాలని కోరారు. గత రేట్ల కంటే తక్కువకు నాణ్యమైన గుడ్లు సరఫరా చేయడానికి ఫౌల్ట్రీ రైతులు సిద్ధంగా ఉన్నారని వారు తెలిపారు. 33 జిల్లాలకు సాధ్యం కాకపోతే కనీసం ఉమ్మడి 10 జిల్లాల ప్రాతిపదికనైనా టెండర్లు కేటాయించాలని విజ్ఞప్తి చేశారు. ఫౌల్ట్రీ రైతులను ఆదుకోకపోతే ఆందోళన చేపడతామని హెచ్చరించారు.

Updated Date - May 18 , 2025 | 04:11 AM