Crop Damage: పంట నష్ట పరిహారం రూ.51.52 కోట్లు!
ABN, Publish Date - May 29 , 2025 | 03:52 AM
రాష్ట్రంలో గత 2 నెలల్లో కురిసిన అకాల, వడగళ్ల వర్షాలతో 28 జిల్లాల్లో పంట దెబ్బ తిన్న రైతులకు ప్రభుత్వం పరిహారం ప్రకటించింది.
హైదరాబాద్, మే 28 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో గత 2 నెలల్లో కురిసిన అకాల, వడగళ్ల వర్షాలతో 28 జిల్లాల్లో పంట దెబ్బ తిన్న రైతులకు ప్రభుత్వం పరిహారం ప్రకటించింది. 41,361 మంది రైతులకు చెందిన 51,528 ఎకరాల్లో పంటలు నష్టపోయినట్లు అధికారులు గుర్తించారు. దెబ్బతిన్న పంటలకు ఎకరానికి రూ.10 వేల చొప్పున రూ.51.52 కోట్ల నష్ట పరిహారాన్ని ప్రభుత్వం మంజూరు చేసింది.
ఈ మేరకు రూ.51.52 కోట్లను రైతుల ఖాతాల్లో నేరుగా జమ చేస్తామని వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. ఓ వైపు పంట ఉత్పత్తుల కొనుగోళ్లు చేపడుతూనే మరోవైపు ప్రకృతి విపత్తులతో నష్టపోయిన రైతులకు పరిహారం ఇచ్చి, అండగా నిలుస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ నెలలో కురిసిన అకాల వర్షాలతో పంట నష్టంపై వారం క్రితం నివేదిక సమర్పించారు. వీరికి మరో విడతలో నిధులు మంజూరు చేసే అవకాశాలున్నాయి.
Updated Date - May 30 , 2025 | 03:01 PM