Tummala: వ్యవసాయ యాంత్రీకరణకు 104 కోట్లు!
ABN, Publish Date - Jun 20 , 2025 | 03:54 AM
వ్యవసాయ యాంత్రీకరణకు 2025- 26 సంవత్సరానికి బడ్జెట్‌లో రూ. 104 కోట్ల కేటాయింపులు చేసినట్లు వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. ఇందులో భాగంగా రైతులకు ఉపయోగపడే వ్యవసాయ యంత్రాలు, పరికరాలను సబ్సిడీ కింద పంపిణీ చేయడానికి ప్రతిపాదనలు తయారుచేయాలని అధికారులను ఆదేశించారు.
వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు
హైదరాబాద్, జూన్ 19 (ఆంధ్రజ్యోతి): వ్యవసాయ యాంత్రీకరణకు 2025- 26 సంవత్సరానికి బడ్జెట్‌లో రూ. 104 కోట్ల కేటాయింపులు చేసినట్లు వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. ఇందులో భాగంగా రైతులకు ఉపయోగపడే వ్యవసాయ యంత్రాలు, పరికరాలను సబ్సిడీ కింద పంపిణీ చేయడానికి ప్రతిపాదనలు తయారుచేయాలని అధికారులను ఆదేశించారు. చిన్న, సన్నకారు రైతులు, మహిళలకు ప్రాధాన్యం ఇవ్వాలన్నారు. వ్యవసాయశాఖ ఉన్నతాధికారులతో మంత్రి తుమ్మల సమీక్ష నిర్వహించారు. కేంద్రం ‘నమో డ్రోన్ దీదీ’ పథకం కింద సరఫరాచేసే 381 డ్రోన్లను మహిళా సంఘాలకు కేటాయించాలని తుమ్మల సూచించారు. పొద్దుతిరుగుడు, జొన్నల కొనుగోళ్లకు సంబంధించి 333 కోట్లు రైతులకు చెల్లించినట్లు తుమ్మల చెప్పారు.
వ్యవసాయ ఉత్పత్తులకు కనీస మద్దతు ధరలు నిర్దేశించే దక్షిణాది రాష్ట్రాల వ్యవసాయ ఖర్చులు, ధరల కమిషన్(సీఏపీపీ) సమావేశం శుక్రవారం హైదరాబాద్‌లో నిర్వహిస్తున్నట్లు మంత్రి తెలిపారు. ఈ సమావేశంలో చర్చించాల్సిన అంశాలపై అధికారులకు దిశానిర్దేశం చేశారు. వ్యవసాయ రంగంలో ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్(ఏఐ) వినియోగంపై ప్రభుత్వం దృష్టి సారించింది. ఈ మేరకు నెదర్లాండ్‌కు చెందిన ‘ఏఆర్‌ఐక్యూటీ’ కంపెనీ ప్రతినిధులతో తుమ్మల సమావేశమయ్యారు. రైతుల ఫిర్యాదులపై ఏఐ ఆధారంగా సూచనలు ఇస్తామని, పంటలను ఆశించే చీడపీడలను మొబైల్ కెమెరాతో స్కాన్‌చేసి గుర్తించే టెక్నాలజీని తీసుకొస్తామని తుమ్మలకు సంస్థ ప్రతినిధులు వివరించారు.
Updated Date - Jun 20 , 2025 | 03:54 AM