మరో 4 రోజులు వర్షాలే!
ABN, Publish Date - May 30 , 2025 | 05:30 AM
వచ్చే నాలుగు రోజులు రాష్ట్రంలో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది.
హైదరాబాద్/సిటీ, మే 29 (ఆంధ్రజ్యోతి): వచ్చే నాలుగు రోజులు రాష్ట్రంలో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది. జూన్ 2 వరకు ఎల్లో అలెర్ట్ జారీ చేసింది. తెలంగాణ అంతటా నైరుతి రుతుపవనాలు విస్తరించినట్లు పేర్కొంది. గురువారం కొత్తగూడెం జిల్లాలో కొన్నిచోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురవగా, మహబూబాబాద్, సిరిసిల్ల, ఆదిలాబాద్, కొత్తగూడెం, జగిత్యాల, జనగాం, కామారెడ్డి, ఖమ్మం, నిర్మల్, నిజామాబాద్ జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిశాయి. హైదరాబాద్‌లో గురువారం సాయంత్రం కురిసిన వర్షానికి ప్రధాన రోడ్లు జలమయమయ్యాయి.
Updated Date - May 30 , 2025 | 05:30 AM