Bhatti Vikramarka: తెలంగాణలో పెట్టుబడులు పెట్టండి
ABN, Publish Date - May 19 , 2025 | 04:23 AM
అభివృద్ధిలో దూసుకుపోతున్న తెలంగాణలో పెట్టుబడులు పెట్టాలని రష్యా కాన్సుల్ జనరల్ వాలెరి ఖోడ్జాయేవ్‌ను ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క కోరారు.
రష్యా కాన్సుల్ జనరల్ ఖోడ్జాయేవ్‌ను కోరిన భట్టి
హైదరాబాద్, మే 18(ఆంధ్రజ్యోతి): అభివృద్ధిలో దూసుకుపోతున్న తెలంగాణలో పెట్టుబడులు పెట్టాలని రష్యా కాన్సుల్ జనరల్ వాలెరి ఖోడ్జాయేవ్‌ను ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క కోరారు. ప్రజాభవన్‌లో ఆయన్ను రష్యా కాన్సుల్ జనరల్ మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలను భట్టి ఆయనకు వివరించారు. హైదరాబాద్ నగరంలో 30 వేల ఎకరాల్లో ఫ్యూచర్ సిటీ నిర్మాణం చేస్తున్నామని, ఫార్మా ఇండస్ర్టీతో పాటు ఇతర పరిశ్రమల విస్తరణకు కావలసిన సహకారాన్ని ప్రభుత్వం అందించి ప్రోత్సహిస్తోందని తెలిపారు.
టెక్స్ టైల్, కోల్ ఇండస్ర్టీ, బయోటెక్నాలజీ, టీ హబ్, ఐటీ ఇండస్ర్టీ అభివృద్థి గురించి వివరించారు. పెట్టుబడులు పెట్టడానికి అన్ని రకాలుగా తెలంగాణ అనువుగా ఉంటుందని వివరించారు. ఈ సందర్భంగా వాలేరి ఖోడ్జాయేవ్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో అడ్వాన్స్ టెక్నాలజీ, పురోగమిస్తున్న పరిశ్రమల అభివృద్ధిని గమనించామని చెప్పారు. కలిసి పనిచేద్దామని, రష్యా పారిశ్రామికవేత్తలు తెలంగాణలో పెట్టుబడులు పెట్టడానికి సిద్ధంగా ఉన్నారని ఖోడ్జాయేవ్ చెప్పారు.
Updated Date - May 19 , 2025 | 04:23 AM