Home » Bhatti Vikramarka
తెలంగాణకు భవిష్యత్ విద్యుత్ అవసరాలు, వాటి ప్రణాళికపై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఇవాళ హైదరాబాద్‌లో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత విద్యుత్ ఉత్పత్తి మెరుగుదల గురించి..
తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కుమారుడు సూర్య విక్రమాదిత్య ఎంగేజ్మెంట్‌కు ఏబీఎన్ - ఆంధ్రజ్యోతి సంస్థల ఎండీ వేమూరి రాధాకృష్ణ హాజరయ్యారు. కాబోయే వధూవరులను ఆశీర్వదించారు.
డ్వాక్రా మహిళలకు వడ్డీ లేని రుణాలను కాంగ్రెస్ ఇచ్చిందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. నిరుపేదలకు రేషన్ కార్డు ద్వారా సన్న బియ్యాన్ని అందించిన ఘనత తమ ప్రభుత్వానిదే అని స్పష్టం చేశారు.
బీసీ రిజర్వేషన్లపై కాంగ్రెస్ ప్రభుత్వం బిల్లు పాస్ చేయడమే కాకుండా న్యాయస్థానాలకు కూడా వెళ్తోందన్నారు డిప్యూటీ సీఎం భట్టి. ఓబీసీపై సుప్రీం కోర్టులో ప్రముఖ న్యాయవాదులు పోరాడుతున్నారని తెలిపారు.
సీఎం రేవంత్ బాధిత కుటుంబానికి అండగా ఉంటామని హామీ ఇచ్చారని.. పూరన్ కుమార్ కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేశారని ఈ సందర్భండి భట్టి విక్రమార్క తెలిపారు. పూరన్ కుమార్ సహచరి ఐఏఎస్ అమనీత్‌ను పరామర్శించడానికి వచ్చిన హర్యానా చీఫ్ సెక్రటరీ అనురాగ్ రస్తోగితో డిప్యూటీ సీఎం విక్రమార్క మాట్లాడారు.
గత బీఆర్ఎస్ దశాబ్ద పాలనలో ఫీజు రీయింబర్స్‌మెంట్ వ్యవస్థను చిన్నాభిన్నం చేసిందని భట్టి విక్రమార్క ఆరోపించారు. బీఆర్ఎస్ రీయింబర్స్‌మెంట్ ఫీజులు చెల్లించకుండా ఆ భారాన్ని తమ మీద మోపిందని విమర్శించారు.
రాష్ట్ర ఆదాయార్జన శాఖల్లో రాబడులు పెరిగేందుకు అధికారులతో కమిటీలు వేయాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఉన్నతాధికారులను ఆదేశించారు.
గతంలో చాలా అంశాలపైన శాసనసభలో పవర్ పాయింట్ ప్రజంటేషన్(పీపీటీ) ఇవ్వడానికి అనుమతించాలంటూ అప్పటి స్పీకర్‌కు తాము లేఖలు రాశామని, అప్పుడు తమకు అవకాశం ఇచ్చారా ? అని బీఆర్‌ఎస్ నాయకత్వాన్ని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క నిలదీశారు.
మాజీ మంత్రి హరీష్ రావు మాట్లాడిన మాటలకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కౌంటర్ ఇచ్చారు. ప్రతిపక్షాలకు అసెంబ్లీలో పీపీటీ ప్రజెంటేషన్ ఇచ్చే సాంప్రదాయం లేదని స్పష్టం చేశారు. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు తమకు పీపీటీ అవకాశం ఇవ్వాలని లేఖ కూడా రాసినట్లు గుర్తుచేశారు.
దేశ భవిష్యత్తుకు రాష్ట్రాలే పట్టుగొమ్మలని తెలంగాణ ఉప ముఖ్యమంత్రి, ఆర్థికశాఖ మంత్రి భట్టి విక్రమార్క తెలిపారు. రాష్ట్రాల ఆదాయాలు క్షీణించకుండా కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు.