Telangana: ఆంధ్రజ్యోతి కథనంపై స్పందించిన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క..
ABN , Publish Date - Jan 18 , 2026 | 04:52 PM
ఆంధ్రజ్యోతి కొత్తపలుకులో వచ్చిన బొగ్గు గని కుంభకోణం కథనం తెలంగాణలో ప్రకంపనలు సృష్టిస్తోంది. ఈ అంశంపై తాజాగా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క స్పందించారు. ప్రజా భవన్‌లో మీడియాతో మాట్లాడిన ఆయన.. బొగ్గు గనుల వ్యవహారంపై వివరణ ఇచ్చారు.
హైదరాబాద్, జనవరి 18: ఆంధ్రజ్యోతి కొత్తపలుకులో వచ్చిన బొగ్గు గని కుంభకోణం కథనం తెలంగాణలో ప్రకంపనలు సృష్టిస్తోంది. ఈ అంశంపై తాజాగా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క స్పందించారు. ప్రజా భవన్‌లో మీడియాతో మాట్లాడిన ఆయన.. బొగ్గు గనుల వ్యవహారంపై వివరణ ఇచ్చారు. ప్రజాసేవ చేయాలనే లక్ష్యంతో రాజకీయాల్లోకి వచ్చానని.. ఆస్తుల సంపాదన కోసమో, వ్యాపారాన్ని విస్తరించుకోవడానికో రాలేదన్నారు. సింగరేణి తెలంగాణ ప్రజల ఆస్తి అని.. దారి దోపిడీదారులు, గద్దల్లా ప్రజలను పీక్కుతినే వారిపై పోరాటం చేస్తున్నామని అన్నారు. వివాదానికి కారణమైన బొగ్గు గనుల టెండర్‌ను రద్దు చేయాలంటూ అధికారులను ఆదేశించారు.
కొత్తపలుకు కథనంలో తన గురించి పలు అంశాలు ప్రస్తావించారన్న భట్టి విక్రమార్క.. అసలు ఎందుకు ఇలా రాశారో పూర్తి వివరాలు తెలుసుకుంటానని చెప్పారు. సింగరేణి సంస్థ టెండర్ల వ్యవహారంపై వార్తా కథనాలు ఏ ఉద్దేశంతో రాశారో తెలియదన్నారు. ఇదే సమయంలో సింగరేణిలో జరుగుతున్న టెండర్లను రద్దు చేయాలని అధికారులను ఆదేశించారు ఉప ముఖ్యమంత్రి. సింగరేణి, తెలంగాణ ఆస్తులను దోపిడీదారుల నుంచి కాపాడుతామన్నారు. ఆత్మగౌరవం కోసం తాము జీవిస్తామన్న భట్టి.. సీఎం, మంత్రులు రాష్ట్ర ప్రయోజనాల కోసం పని చేస్తున్నట్లు చెప్పుకొచ్చారు. తాను 40 ఏళ్లుగా సమాజం కోసం పని చేస్తున్నానని.. తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని భట్టి విక్రమార్క అన్నారు.
Also Read:
మా ప్రభుత్వంపై ఫేక్ ప్రచారం చేస్తున్నారు.. జగన్ అండ్ కోపై సీఎం ఫైర్
అది నోరా లేక క్రషరా.. గాజు ముక్కలను ఏం చేస్తున్నాడో చూడండి..
ట్రంప్ సుంకాల వల్ల చైనా, రష్యా పండగ చేసుకుంటున్నాయి: ఈయూ ఆగ్రహం..