ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Farmers: వ్యవసాయానికి రూ.లక్ష కోట్లు

ABN, Publish Date - Jun 21 , 2025 | 03:09 AM

రాష్ట్రంలో వ్యవసాయ రంగం, రైతుల సంక్షేమానికి గతంలో ఎన్నడూ లేని విధంగా పెద్ద మొత్తంలో నిధులు ఖర్చు చేస్తున్నట్లు సీఎంవో వెల్లడించింది.

  • ఏడాదిన్నర పాలనలో సాగుకు పెద్దపీట.. రైతు సంక్షేమమే లక్ష్యంగా అనేక పథకాలు

  • 20,616కోట్ల మేర పంట రుణాల మాఫీ

  • వరి సాగు, దిగుబడిలో నెం.1గా రాష్ట్రం: సీఎంవో

హైదరాబాద్‌, జూన్‌ 20 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో వ్యవసాయ రంగం, రైతుల సంక్షేమానికి గతంలో ఎన్నడూ లేని విధంగా పెద్ద మొత్తంలో నిధులు ఖర్చు చేస్తున్నట్లు సీఎంవో వెల్లడించింది. రేవంత్‌రెడ్డి బాధ్యతలు చేపట్టిన ఏడాదిన్నర వ్యవధిలోనే(18 నెలల్లో) రైతుల సంక్షేమం, రైతు కుటుంబాల అభ్యున్నతి కోసం అమలు చేసిన పథకాలకు రూ.1.04లక్ష కోట్లను ఖర్చు చేసినట్లు పేర్కొంది. దేశంలో ఏ రాష్ట్రం కూడా ఇంత తక్కువ కాలంలో ఇంత పెద్ద మొత్తం ఖర్చు చేసిన దాఖలాలు లేవని శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపింది. తొలి ఏడాదే ఏక కాలంలో రూ.2లక్షల లోపు రుణాలను మాఫీ చేసి 25 లక్షల మంది రైతులను రుణ విముక్తులను చేసినట్లు చెప్పింది. కాంగ్రెస్‌ ప్రభుత్వం తొలి ఏడాదిలోనే రూ.20,616 కోట్ల పంట రుణాలను మాఫీ చేసిందని గుర్తు చేసింది. ఇప్పటిదాకా రైతు భరోసాకు రూ.12,682 కోట్లు చెల్లించామని, ఈసారి వానాకాలం పంటలకు పెట్టుబడి సాయం అందించటంలో కొత్త రికార్డు నెలకొల్పామని వెల్లడించింది. జూన్‌ 16 నుంచి 5 రోజుల్లోనే 7310.59 కోట్లు రైతుల ఖాతాల్లో జమ చేశామని పేర్కొంది. మొత్తం 65.12 లక్షల మంది రైతులు రైతు భరోసాను అందుకున్నారని తెలిపింది. తొమ్మిది రోజుల్లో 9వేల కోట్లు జమ చేయాలన్న సీఎం ఆదేశాలతో ఆర్థిక, వ్యవసాయ శాఖలు కలిసి రైతు భరోసా పంపిణీని వేగవంతం చేశాయని వెల్లడించింది.

48 గంటల్లోనే ధాన్యం డబ్బు జమ

రాష్ట్రంలోని 29 లక్షల వ్యవసాయ పంపుసెట్లకు ఉచితంగా కరెంటు సరఫరా నిమిత్తం విద్యుత్తు సంస్థలకు రూ.16,691 కోట్లను చెల్లించినట్లు సీఎంవో తెలిపింది. ధాన్యం కొనుగోలు కేంద్రాల నిర్వహణలోనూ ఈసారి ప్రభుత్వం పకడ్బందీ చర్యలు చేపట్టామని, 48 గంటల్లోనే రైతుల ఖాతాల్లో ధాన్యం డబ్బులు జమ చేశామని తెలిపింది. సన్న వడ్లకు రూ.500 బోనస్‌ నిర్ణయం.. రైతులకు భరోసా కల్పించడమే కాకుండా, సన్నాల దిగుబడి పెరుగుదలకు దోహదపడిందని పేర్కొంది. సుమారు రూ.29,562 కోట్ల విలువైన ధాన్యాన్ని కొనుగోలు చేసి... 21,59,000 రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేసినట్లు వెల్లడించింది. ఈ ఏడాది 2.80 కోట్ల టన్నుల ధాన్యం దిగుబడితో దేశంలోనే తెలంగాణ నంబర్‌ వన్‌ స్థానంలో నిలిచిందని తెలిపింది. యాసంగిలో దొడ్డు రకం 80.56 లక్షల టన్నులు, సన్న రకం 46.96 లక్షల టన్నుల ఉత్పత్తి అయినట్లు ప్రభుత్వం వెల్లడించింది. ఇటీవల అకాల వర్షాలు, వరదలతో పంట నష్టపోయిన రైతులకు ఎకరాకు రూ.10 వేల చొప్పున రూ.260 కోట్ల పరిహారం చెల్లించినట్లు వివరించింది.

పామాయిల్‌ సాగులోనూ అగ్రగామిగా..

వ్యవసాయ రంగంలో రైతులకు లబ్ధి చేకూర్చే 16 కేంద్ర ప్రాయోజిత పథకాలు... రాష్ట్ర మ్యాచింగ్‌ గ్రాంట్‌ విడుదలకాక ఆగిపోగా, కాంగ్రెస్‌ ప్రభుత్వం పునరుద్ధరించినట్లు సీఎంవో వెల్లడించింది. ఇందుకోసం రూ.245 కోట్లు ఖర్చు పెట్టినట్లు తెలిపింది. పామాయిల్‌ సాగులోనూ దేశంలోనే అగ్రగామిగా తెలంగాణ నిలిచిందని, సుమారుగా 60,432 ఎకరాల్లో పామాయిల్‌ సాగు జరుగుతోందని పేర్కొంది. దేశంలో ఎక్కడా లేని విధంగా బిందు, తుంపర సేద్య పరికరాలపై రాయితీ ఇస్తున్నట్లు తెలిపింది. ఎస్సీ, ఎస్టీ రైతులకు 100 శాతం, చిన్న సన్నకారు, బీసీ రైతులకు 90 శాతం, ఇతరులకు 80 శాతం రాయితీపై డ్రిప్‌ పరికరాలు, రైతులందరికీ 75 శాతం రాయితీతో స్పింక్రర్లను అందిస్తున్నట్లు పేర్కొంది.

Updated Date - Jun 21 , 2025 | 03:09 AM