ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

మేం లేవనెత్తిన అంశాలను చేర్చలేదు

ABN, Publish Date - Jun 01 , 2025 | 03:57 AM

గోదావరి నది యాజమాన్య బోర్డు (జీఆర్‌ఎంబీ) సమావేశంలో తాము లేవనెత్తిన అంశాలను మినిట్స్‌లో చేర్చకపోవడాన్ని తెలంగాణ తీవ్రంగా ఆక్షేపించింది.

  • గోదావరి బోర్డు సమావేశ మినిట్స్‌పై తెలంగాణ తీవ్ర ఆక్షేపణ

హైదరాబాద్‌, మే 31 (ఆంధ్రజ్యోతి): గోదావరి నది యాజమాన్య బోర్డు (జీఆర్‌ఎంబీ) సమావేశంలో తాము లేవనెత్తిన అంశాలను మినిట్స్‌లో చేర్చకపోవడాన్ని తెలంగాణ తీవ్రంగా ఆక్షేపించింది. తాము ప్రస్తావించిన అంశాలు యథాతథంగా మినిట్స్‌లో రికార్డు కాలేదంటూ గోదావరి బోర్డు చైర్మన్‌ ఏకే ప్రధాన్‌కు తెలంగాణ ఈఎన్‌సీ(జనరల్‌) జి.అనిల్‌కుమార్‌ శుక్రవారం (ఈ నెల 30న) లేఖ రాశారు.


బోర్డు అనేది తెలుగు రాష్ట్రాల అధికారులతో కూడిన విభాగమని, చైర్మన్‌కు ప్రత్యేకంగా, ఏకపక్షంగా ఎలాంటి అధికారాలు ఉండవని స్పష్టం చేశారు. బోర్డు సభ్యకార్యదర్శిపై ఆరోపణలపై విచారణ కోసం ప్రత్యేకంగా కమిటీ వేయాలని తెలుగు రాష్ట్రాలు డిమాండ్‌ చేయగా సమావేశంలో అంగీకారం తెలిపి.. తర్వాత బోర్డు సభ్యకార్యదర్శి వ్యవహారశైలిపై చర్చించే అధికారం తెలుగు రాష్ట్రాలకులేదని ఎలా మినిట్స్‌లో చేర్చుతారని ప్రశ్నించారు.

Updated Date - Jun 01 , 2025 | 03:57 AM