Telangana Police: సోషల్ మీడియాలో పోస్టుల విషయంలో జాగ్రత్త
ABN, Publish Date - Apr 20 , 2025 | 06:53 AM
తెలంగాణ పోలీసు శాఖ సోషల్ మీడియా పోస్టుల విషయంలో జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించింది. అసత్య పోస్టులు షేర్ చేస్తే, చట్టం ప్రకారం చర్యలు తీసుకుంటామనే హెచ్చరికను తెలియజేసింది
పోలీసు శాఖ హెచ్చరికలు
హైదరాబాద్, ఏప్రిల్ 19 (ఆంధ్రజ్యోతి): సోషల్ మీడియాలో పోస్టుల విషయంలో జాగ్రత్తగా ఉండాలని తెలంగాణ పోలీసు శాఖ హెచ్చరించింది. పోస్టులు పెట్టే ముందు, ఇతరుల పోస్టులను షేర్ చేసే ముందు ఒకటికి రెండు సార్లు ఆలోచించుకోవాలని సూచించింది. అసత్యాలను ప్రచారం చేస్తే.. తగిన మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని చెబుతూ.. ఇటీవల కంచ గచ్చిబౌలి విషయంలో షేర్ అయిన ఏఐ ఆధారిత పోస్టుల గురించి ప్రస్తావించింది. పదేపదే అసత్యాలను ప్రచారం చేసే వారైతే చర్యలు తీసుకుంటామని చెప్పింది.
Updated Date - Apr 20 , 2025 | 06:53 AM