ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Godavari Banakacharla Project: బనకచర్లకు అనుమతులు ఇవ్వొద్దు

ABN, Publish Date - Jul 25 , 2025 | 04:59 AM

ఆంధ్రప్రదేశ్‌ ప్రతిపాదించిన గోదావరి-బనకచర్ల ప్రాజెక్టుకు ఎలాంటి అనుమతులు జారీ చేసే ప్రక్రియను చేపట్టరాదని కేంద్ర జలశక్తి శాఖను తెలంగాణ కోరింది.

ఆ ప్రక్రియను చేపట్టొద్దు.. ఏపీ నివేదికను పక్కనపెట్టండి.. ట్రైబ్యునల్‌ తీర్పునకు విరుద్ధంగా ప్రాజెక్టు ప్రతిపాదన

  • పోలవరం నిర్వహణలో మార్పులకు చాన్స్‌

  • బ్యాక్‌ వాటర్‌తో తెలంగాణకు ముంపు

  • ఇప్పటికే కృష్ణా బేసిన్‌లో తీవ్ర నీటి కొరత

  • కేంద్ర జలశక్తి శాఖకు తెలంగాణ లేఖ

హైదరాబాద్‌, జూలై 24 (ఆంధ్రజ్యోతి): ఆంధ్రప్రదేశ్‌ ప్రతిపాదించిన గోదావరి-బనకచర్ల ప్రాజెక్టుకు ఎలాంటి అనుమతులు జారీ చేసే ప్రక్రియను చేపట్టరాదని కేంద్ర జలశక్తి శాఖను తెలంగాణ కోరింది. ఈ ప్రాజెకుపై ఏపీ ప్రభుత్వం అందించిన ప్రాథమిక సాధ్యాసాధ్యాల నివేదిక (పీఎ్‌ఫఆర్‌)పై కేంద్రం.. మహారాష్ట్ర, ఒడిశా, కర్ణాటక, ఛత్తీ్‌సగఢ్‌, తెలంగాణ అభిప్రాయం కోరింది. దాంతో తెలంగాణ నీటి పారుదల శాఖ ముఖ్య కార్యదర్శి రాహుల్‌ బొజ్జా... కేంద్ర జలశక్తి శాఖ కార్యదర్శి దేబశ్రీ ముఖర్జీకి లేఖ రాశారు. ఈ ప్రాజెక్టు ఏపీ పునర్‌వ్యవస్థీకరణ చట్టం-2014, గోదావరి ట్రైబ్యునల్‌ తీర్పు, పోలవరం ప్రాజెక్టుకు ఇచ్చిన పర్యావరణ అనుమతికి వ్యతిరేకమని లేఖలో పేర్కొన్నారు. పోలవరం ప్రాజెక్టుకు తెలంగాణ సమ్మతి తెలిపినట్టు భావించాలని పునర్‌వ్యవస్థీకరణ చట్టం సెక్షన్‌ 90(3)లోని నిబంధన ‘గోదావరి-బనకచర్ల’కు వర్తించదన్నారు. ‘పోలవరం’ విస్తరణలో భాగంగా చేపట్టిన ‘బనకచర’్లకు తెలంగాణ సమ్మతి తీసుకోవాల్సిందేనని స్పష్టం చేశారు. ‘అన్ని మిగులు జలాలూ ఉమ్మడి ఏపీకి చెందుతాయని గోదావరి ట్రైబ్యునల్‌ తీర్పులో ఉంది.

ఆ జలా ల ఆధారంగా ప్రతిపాదించిన బనకచర్లకు ఉమ్మడి ఏపీ నుంచి వేరుపడిన తెలంగాణ సమ్మతి తప్పనిసరి. ఈ ప్రాజెక్టు తెలంగాణ నీటి హక్కులకు తీవ్ర విఘాతం కలిగిస్తుంది. బేసిన్‌లో చివరి రాష్ట్రం కావడంతో బనకచర్లను చేపట్టే హక్కు తమకు ఉందని ఏపీ పేర్కొనడం గోదావరి ట్రైబ్యునల్‌ తీర్పు వక్రీకరించడమేన’ని పేర్కొన్నారు. కేంద్రం బనకచర్ల పీఎఫ్‌ఆర్‌ను వెంటనే పక్కనపెట్టాలని కోరారు. వరద జలాల పంపిణీపై ట్రైబ్యునల్‌ తీర్పులో ఎలాంటి ప్రస్తావన లేదని లేఖలో పేర్కొన్నారు.

తెలంగాణ లేఖలోని మిగతా కీలకాంశాలు

  • బనకచర్ల ద్వారా గోదావరి జలాలను కృష్ణా బేసిన్‌కు, అక్కడి నుంచి పెన్నా బేసిన్‌లోని రాయలసీమ, ప్రకాశం, నెల్లూరు జిల్లాలకు తరలించాలని ప్రతిపాదించారు. దీని కింద ప్రతిపాదించిన 9.14 లక్షల హెక్టార్ల ఆయకట్టు స్థిరీకరణ, 3 లక్ష ల హెక్టార్ల కొత్త ఆయకట్టు గోదావరి బేసిన్‌ పరిధిలోకి రాదు. పూర్తిగా కృష్ణా, పెన్నా బేసిన్ల పరిధిలోది కాబట్టి ఈ అంశాన్ని పునఃపరిశీలించాలి. వెలుపలి ప్రాంతాలకు ఏపీ కృష్ణా జలాలు తరలించడంతో ఇప్పటికే కృష్ణా బేసిన్‌ తీవ్ర నీటి కొరత ఎదుర్కొంటోంది. కృష్ణా బేసిన్‌ మీదుగా పెన్నా బేసిన్‌కు గోదావరి జలాల తరలింపు కృష్ణా ట్రైబ్యునల్‌-1 తీర్పునకు విరుద్ధం.

  • ఏపీ రోజుకు 2 టీఎంసీల చొప్పున 200 టీఎంసీల గోదావరి వరద జలాలను తరలింపుకు బనకచర్ల చేపట్టింది. పనులు రోజుకు 3 టీఎంసీల తరలింపునకనుగుణంగా ప్రతిపాదించారు.

  • ఏపీ పునర్‌వ్యవస్థీకరణ చట్టం-2014లోని సెక్షన్లు 84(3)(2), 85(8సీ/8డీ) ప్రకారం కొత్త ప్రాజెక్టులకు తొలుత సంబంధిత నదీ యాజమాన్య బోర్డు, ఆ తర్వాత సీడబ్ల్యూసీ, అపెక్స్‌ కౌన్సిల్‌ నుంచి అనుమతులు తీసుకోవాల్సి ఉంటుంది.

  • బనకచర్లతో పోలవరం ప్రాజెక్టు గేట్ల నిర్వహణ లో మార్పులు జరిగే ప్రమాదం ఉంది. తద్వారా బ్యాక్‌వాటర్‌తో తెలంగాణ భూభాగంలో ముంపు సమస్య మరింత తీవ్రమవుతుంది. బ్యాక్‌వాటర్‌ పెరిగి వాగులు, వంకల్లో వరదలు వెనక్కి తన్ని తే భద్రాచలం పట్టణం, ఆలయంతో పాటు పరిసర గ్రామాలు, మణుగూరు హెవీ వాటర్‌ ప్లాంట్‌ ముంపునకు గురయ్యే ప్రమాదం ఉంది.

  • బనకచర్లలో భాగంగా పోలవరం ప్రాజెక్టు ఫోర్‌షోర్‌ నుంచి నీటి తరలింపుతో ఆ పనులు పోలవరం ప్రాజెక్టు ఆథారిటీ (పీపీఏ) పరిధిలోకి వస్తాయి. పునర్‌వ్యవస్థీకరణ చట్టం సెక్షన్‌ 90 కింద ఏర్పాటైన పీపీఏ.. పోలవరం పనులను టీఏసీ, సీడబ్ల్యూసీ అనుమతులకు లోబడి నిర్వహించాల్సి ఉంటుంది. టీఏసీ, సీడబ్ల్యూసీ అనుమతులు లేకుండా బనకచర్ల పేరుతో పోలవరం ప్రాజెక్టు విస్తరణ పనులను పీపీఏ అనుమతించరాదు.

  • పోలవరం ప్రాజెక్టు ద్వారా 449.78 టీఎంసీల తరలింపుకు డీపీఆర్‌ తయారుచేయగా, తాజాగా ఇదే ప్రాజెక్టు ద్వారా మరో 200 టీఎంసీల తరలింపునకు బనకచర్లను ఏపీ ప్రతిపాదించింది. ఈ అవసరాలు తీర్చేందుకు నీటి నిల్వలను పెంచుకుంటే.. పోలవరం ప్రాజెక్టు షెడ్యూల్‌లో మార్పులు చోటుచేసుకునే అవకాశం ఉంది. ఇది ఉమ్మడి ఏపీ, మధ్యప్రదేశ్‌, ఒడిశా మధ్య కుదిరిన ఒప్పందానికి విరుద్ధం. కృష్ణా జలాల్లో తెలంగాణకు రావాల్సిన 45 టీఎంసీల వాటాకు ఏపీ సమ్మతి తెలపడం లేదు. పట్టిసీమతో తరలించే గోదావరి జలాల్లోనూ వాటా ఇవ్వడం లేదు.

  • పోలవరం ప్రాజెక్టుకు వచ్చే వరదల తీవ్రత ఆధారంగా ఏ స్థాయిలో నీరు నిల్వ చేయాలన్న అంశాన్ని గోదావరి ట్రైబ్యునల్‌ తన తీర్పులో స్పష్టంగా పేర్కొంది. ఆపరేషన్‌ ప్రొటోకాల్‌లో మార్పులను తెలంగాణ, ఛత్తీ్‌సగఢ్‌, ఒడిశా రాష్ట్రాలతో సంప్రదింపుల తర్వాతే చేపట్టాలి.

  • పోలవరం ప్రాజెక్టుకు జారీ చేసిన పర్యావరణ అనుమతులకు విరుద్ధంగా చేపట్టిన అదనపు పనులను నిలిపివేయాలని 2011లో కేంద్ర పర్యావరణ శాఖ ఆదేశాలు జారీ చేయగా.. ఈ అంశం ప్రస్తుతం సుప్రీంకోర్టులో పెండింగ్‌లో ఉంది.

ఈ వార్తలు కూడా చదవండి..

తెలంగాణలో చేపట్టిన సర్వే దేశానికి ఆదర్శం కావాలి: ఖర్గే

మాజీ మంత్రి మల్లారెడ్డికి బిగ్ షాక్.. ఐటీ అధికారుల సోదాలు

Read latest Telangana News And Telugu News

Updated Date - Jul 25 , 2025 | 04:59 AM