ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Hyderabad: తెలంగాణ సాధనకు జైపాల్‌రెడ్డి ఎనలేని కృషి

ABN, Publish Date - Jul 29 , 2025 | 04:00 AM

రాష్ట్ర సాధన కోసం జైపాల్‌రెడ్డి ఎనలేని కృషి చేశారని రాష్ట్ర మంత్రులు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, పొన్నం ప్రభాకర్‌ కొనియాడారు.

  • మంత్రులు కోమటిరెడ్డి, పొన్నం నివాళులు

రాంగోపాల్‌పేట్‌, జూలై 28 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర సాధన కోసం జైపాల్‌రెడ్డి ఎనలేని కృషి చేశారని రాష్ట్ర మంత్రులు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, పొన్నం ప్రభాకర్‌ కొనియాడారు. కేంద్ర మాజీ మంత్రి ఎస్‌.జైపాల్‌రెడ్డి 6వ వర్ధంతి సందర్భంగా సోమవారం నెక్లె్‌సరోడ్డు పీవీ మార్గ్‌లోని ఆయన సమాధి వద్ద పలువురు ప్రముఖులు నివాళులర్పించారు. ఈ సందర్భంగా కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి మాట్లాడుతూ.. జైపాల్‌ రెడ్డికి భారతరత్న ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. ఆయన కృషితోనే హైదరాబాద్‌కు మెట్రో రైల్‌ వచ్చిందన్నారు.

జైపాల్‌రెడ్డి అంతటి మహనీయుడిని తెలంగాణ మరువదన్నారు. మంత్రి పొన్నం ప్రభాకర్‌ మాట్లాడుతూ.. తెలంగాణ ముద్దుబిడ్డ, విలువల విఖ్యాతుడు జైపాల్‌రెడ్డి అని, ఆయన చేసిన సేవలు, ఆయన మార్గం అనితర సాఽధ్యమని కొనియాడారు. హరియాణ మాజీ గవర్నర్‌ బండారు దత్తాత్రేయ, స్పీకర్‌ గడ్డం ప్రసాద్‌, మంత్రి వివేక్‌ వెంకటస్వామి, శాసన మండలి చైౖర్మన్‌ గుత్తా సుఖేందర్‌ రెడ్డి, తెలంగాణ ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డి, ఎమ్మార్పీఎస్‌ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగలతో పాటు పలువురు కాంగ్రెస్‌ నాయకులు జైపాల్‌ రెడ్డి సమాధి వద్ద నివాళులర్పించారు.

Updated Date - Jul 29 , 2025 | 04:01 AM