Judges Association: జడ్జిల సంఘం అధ్యక్షుడిగా రాజగోపాల్
ABN, Publish Date - Jul 28 , 2025 | 04:37 AM
తెలంగాణ జడ్జీల సంఘం ఎన్నికల ఫలితాలు ఆదివారం వెలువడ్డాయి. ఈ ఎన్నికలను ఈనెల 19న నిర్వహించగా ఓట్ల లెక్కింపు అనంతరం ఫలితాలు ప్రకటించారు.
ప్రధాన కార్యదర్శిగా మురళీ మోహన్
హైదరాబాద్, జూలై 27(ఆంధ్రజ్యోతి): తెలంగాణ జడ్జీల సంఘం ఎన్నికల ఫలితాలు ఆదివారం వెలువడ్డాయి. ఈ ఎన్నికలను ఈనెల 19న నిర్వహించగా ఓట్ల లెక్కింపు అనంతరం ఫలితాలు ప్రకటించారు. రాష్ట్ర అధ్యక్షుడిగా ఖమ్మం జిల్లా ప్రిన్సిపల్ జడ్జి జి.రాజగోపాల్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ప్రధాన కార్యదర్శిగా కె.మురళీ మోహన్ ఎన్నికైనట్టు ఎన్నికల అధికారి ఎస్.శశిధర్ రెడ్డి ప్రకటించారు.
మహిళా ప్రతినిధిగా జె.మైత్రేయి, ఉపాఽధ్యక్షులుగా డి.దుర్గా ప్రసాద్, జి.వేణు, పి.లక్ష్మిశారద, సంయుక్త కార్యదర్శులుగా సిహెచ్.సంపత్, పి.శ్రీదేవి, ఎం.రాజు ఎన్నికయ్యారు. కార్యవర్గ సభ్యులుగా ఎండి.గౌస్ బాషా, కిరణ్ కసమాల, శ్యాంప్రసాద్, బి.కల్పన, వి.శివనాయక్, జి.హిమబిందు, ముహమ్మద్ అసదుల్లా షరీఫ్, కె.గోపీకృష్ణ, జె.ఉపేందర్ రావు, ఎన్.అరుణ్ కుమార్, కె.పూజ, ఖుష్బూ ఉపాధ్యాయ్ ఎన్నికయ్యారు. కొత్త కార్యవర్గం రెండేళ్లపాటు ఉంటుంది.
Updated Date - Jul 28 , 2025 | 04:37 AM