National Young Weaver Award: గూడ పవన్‌కు జాతీయ యంగ్ వీవర్ అవార్డు
ABN, Publish Date - Jul 22 , 2025 | 04:35 AM
తెలంగాణకు చెందిన గూడ పవన్‌కు జాతీయ యంగ్ వీవర్ అవార్డు లభించింది. సహజ రంగులతో డబుల్ ఇక్కత్ సిల్కు చీర తయారీకిగాను ఆయనకు ఈ గౌరవం దక్కింది.
మార్కెటింగ్‌లో నరేంద్ర హ్యాండ్లూమ్స్‌కు దక్కిన గౌరవం
న్యూఢిల్లీ, జూలై 21 (ఆంధ్రజ్యోతి) : తెలంగాణకు చెందిన గూడ పవన్‌కు జాతీయ యంగ్ వీవర్ అవార్డు లభించింది. సహజ రంగులతో డబుల్ ఇక్కత్ సిల్కు చీర తయారీకిగాను ఆయనకు ఈ గౌరవం దక్కింది. మార్కెటింగ్ విభాగంలో నరేంద్ర హ్యాండ్లూమ్స్‌కు అవార్డు వచ్చింది. ఈమేరకు కేంద్ర జౌళి మంత్రిత్వ శాఖ సోమవారం అవార్డులను ప్రకటించింది. ఆగస్టు 7న 11వ జాతీయ చేనేత దినోత్సవ వేడుకల సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈ అవార్డులను ప్రదానం చేస్తారు.
5 సంత్ కబీర్ అవార్డులు, 19 జాతీయ చేనేత అవార్డులతో మొత్తం 24 మందిని చేనేత రంగంలో చేసిన అత్యుత్తమ కృషికి గాను సత్కరించనున్నారు. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన లక్కా శ్రీనివాసులుకు సంత్ కబీర్ అవార్డు, కర్నాటి మురళికి చేనేత అవార్డు, జుజారే నాగరాజుకు జాతీయ హ్యాండ్లూమ్ అవార్డులు దక్కాయి.
Updated Date - Jul 22 , 2025 | 04:35 AM