ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Duddilla Sridhar Babu: యువతకు ఉపాధి కల్పనే ప్రభుత్వ సంకల్పం

ABN, Publish Date - Jul 24 , 2025 | 02:01 AM

తెలంగాణకు కొత్త పరిశ్రమలు వచ్చి, స్థానిక యువతకు ఉపాధి దక్కాలన్నదే సీఎం రేవంత్‌ రెడ్డి నేతృత్వంలోని ప్రజాప్రభుత్వం సంకల్పమని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌ బాబు అన్నారు.

  • పెట్టుబడులతో వచ్చే పారిశ్రామికవేత్తలను ప్రోత్సహిస్తాం

  • పరిశ్రమలు వెళ్లిపోతున్నాయనేది బీజేపీ, బీఆర్‌ఎస్‌ దుష్ప్రచారం

  • మంత్రి శ్రీధర్‌ బాబు

హైదరాబాద్‌, జూలై 23(ఆంధ్రజ్యోతి): తెలంగాణకు కొత్త పరిశ్రమలు వచ్చి, స్థానిక యువతకు ఉపాధి దక్కాలన్నదే సీఎం రేవంత్‌ రెడ్డి నేతృత్వంలోని ప్రజాప్రభుత్వం సంకల్పమని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌ బాబు అన్నారు. తెలంగాణ పురోగతిలో భాగస్వాములయ్యే పారిశ్రామికవేత్తలకు ప్రభుత్వం అండగా ఉంటుందని పేర్కొన్నారు. పెట్టుబడులతో రాష్ట్రానికి వచ్చే పారిశ్రామికవేత్తలను ప్రోత్సహిస్తామని, నిబంధనల పేరిట ఇబ్బంది పెట్టమని స్పష్టం చేశారు. సీఐఐ, ఫిక్కీ, ఎఫ్‌టీసీసీఐ, ఎలీప్‌, టిఫ్‌, టాప్మా, టీఎస్‌ టీఎంఏ తదితర పారిశ్రామిక సంఘాల ప్రతినిధులతో సచివాలయంలో బుధవారం నిర్వహించిన సమావేశంలో మంత్రి శ్రీధర్‌బాబు ఈ మేరకు మాట్లాడారు. రాష్ట్రంలోని ప్రతి పరిశ్రమను కాపాడుకుంటామని, ముఖ్యంగా ఎంఎ్‌సఎంఈ రంగానికి అండగా ఉంటామని పునరుద్ఘాటించారు.

గత ప్రభుత్వం మాదిరిగా ఏకపక్షంగా వ్యవహరించమని, పారిశ్రామికాభివృద్థికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. సీఎం రేవంత్‌ రెడ్డి నాయకత్వంలో రాష్ట్రానికి కొత్తగా రూ.3 లక్షల కోట్లకు పైగా పెట్టుబడులను తీసుకొచ్చామని, ప్రైవేటు రంగంలో లక్ష మందికి పైగా ఉపాధి కల్పించామని వివరించారు. రాష్ట్రం నుంచి పరిశ్రమలు తరలి వెళ్లిపోతున్నాయంటూ బీఆర్‌ఎస్‌, బీజేపీ దుష్ప్రచారం చేస్తున్నాయని తెలిపారు. పారిశ్రామికాభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను ఆయా సంఘాల ప్రతినిధులకు వివరించిన మంత్రి శ్రీధర్‌బాబు.. వారి నుంచి సలహాలు, సూచనలు స్వీకరించారు. పారిశ్రామికవేత్తలు ఎదుర్కొంటున్న సమస్యలను తెలుసుకుని వాటిని పరిష్కారించాలని అధికారులను ఆదేశించారు. తెలంగాణ కనీస వేతనాల సలహా బోర్డు అధ్యక్షుడు బీ జనక్‌ ప్రసాద్‌, పరిశ్రమల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సంజయ్‌ కుమార్‌, కార్మిక శాఖ ముఖ్య కార్యదర్శి దాన కిశోర్‌ తదితరులు పాల్గొన్నారు.

ఈ వార్తలు కూడా చదవండి..

దంచికొడుతున్న వాన.. భారీగా ట్రాఫిక్ జామ్

రైతులను ఇబ్బంది పెడితే కఠిన చర్యలు

Read latest Telangana News And Telugu News

Updated Date - Jul 24 , 2025 | 02:01 AM