ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

గురుకులాల్లో కొత్తగా ఫౌండేషన్‌ కోర్సులు

ABN, Publish Date - Apr 03 , 2025 | 04:41 AM

ఈ విద్యాసంవత్సరంలో 8వ తరగతి నుంచి కోర్సులను ప్రారంభించేలా చర్యలు చేపట్టామని, అందుకు సంబంధించిన కార్యాచరణ సిద్ధం చేశామని ఆమె తెలిపారు.

హైదరాబాద్‌, ఏప్రిల్‌ 2 (హైదరాబాద్‌): సాంఘిక సంక్షేమ గురుకులాల్లో ఫౌండేషన్‌ కోర్సుల ప్రారంభానికి తెలంగాణ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. విద్యార్థులను పోటీ పరీక్షలకు సన్నద్ధం చేయడానికి ఈ కోర్సులు దోహదపడతాయన్న నిపుణులు, అధ్యాపకుల సూచనల్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లగా పలు దఫాల చర్చల అనంతరం ఈ నిర్ణయం తీసుకున్నట్లు టీజీఎ్‌సడబ్ల్యూఆర్‌ఈఐఎ్‌స(తెలంగాణ సోషల్‌ వెల్ఫేర్‌ రెసిడెన్షియల్‌ ఎడ్యుకేషన్‌ ఇనిస్టిట్యూషన్స్‌) కార్యదర్శి వి.ఎ్‌స.అలగు వర్షిణి తెలిపారు.


ఈ విద్యాసంవత్సరంలో 8వ తరగతి నుంచి కోర్సులను ప్రారంభించేలా చర్యలు చేపట్టామని, అందుకు సంబంధించిన కార్యాచరణ సిద్ధం చేశామని ఆమె తెలిపారు. ఆసక్తి కలిగిన విద్యార్థులకు ప్రవేశ పరీక్ష నిర్వహించి అర్హత సాధించిన వారికి ఫౌండేషన్‌ కోర్సుల్లో చేరేందుకు అవకాశం కల్పిస్తారు. నైపుణ్యం, అనుభవం ఉన్న అధ్యాపకుల ద్వారా శిక్షణ ఇచ్చేలా ప్రణాళిక రూపొందించారు.

Updated Date - Apr 03 , 2025 | 04:41 AM