ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Rythu Bharosa: 4 రోజులు.. రూ.6,405 కోట్లు!

ABN, Publish Date - Jun 20 , 2025 | 05:14 AM

రైతువేదికల ప్రారంభోత్సవం సందర్భంగా ప్రకటించినమేరకు రాష్ట్ర ప్రభుత్వం శరవేగంగా రైతు భరోసా చెల్లింపులు చేస్తోంది. 9 రోజుల్లో రూ.9,000 కోట్లు జమచేస్తామని సీఎం రేవంత్‌రెడ్డి హామీ ఇచ్చినమేరకు ఆర్థిక శాఖ వాయువేగంతో రైతుల ఖాతాల్లో నిధులు జమ చేస్తోంది.

  • 62.47 లక్షల మంది రైతులకు నగదు బదిలీ పూర్తి

  • శరవేగంగా రైతుభరోసా చెల్లింపులు

హైదరాబాద్‌, జూన్‌ 19 (ఆంధ్రజ్యోతి): రైతువేదికల ప్రారంభోత్సవం సందర్భంగా ప్రకటించినమేరకు రాష్ట్ర ప్రభుత్వం శరవేగంగా రైతు భరోసా చెల్లింపులు చేస్తోంది. 9 రోజుల్లో రూ.9,000 కోట్లు జమచేస్తామని సీఎం రేవంత్‌రెడ్డి హామీ ఇచ్చినమేరకు ఆర్థిక శాఖ వాయువేగంతో రైతుల ఖాతాల్లో నిధులు జమ చేస్తోంది. నాలుగు రోజుల్లోనే 62.47 లక్షల మంది రైతుల ఖాతాల్లో రూ.6,405 కోట్లు జమచేసినట్లు ప్రభుత్వం వెల్లడించింది. గురువారం నాటికి ఐదెకరాల వరకు భూములున్న రైతులకు రైతుభరోసా పంపిణీ చేశారు. కోటిన్నర ఎకరాలకు ఎకరానికి రూ.6 వేల చొప్పున చెల్లించేందుకు రూ.9 వేల కోట్ల నిధులు అవసరం. జూన్‌లో రైతుభరోసా కోసం ప్రభుత్వం నిధుల సమీకరణ మొదలుపెట్టింది. రిజర్వుబ్యాంకు నుంచి కొంత అప్పుతోపాటు ఇతరత్రా ఆదాయ వనరుల ద్వారా నిధులు సమకూర్చుకుంది. ఈనెల 16నఆచార్య జయశంకర్‌ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వ విద్యాలయంలో నిర్వహించిన రైతునేస్తం కార్యక్రమ వేదిక నుంచి వానాకాలం రైతుభరోసా చెల్లింపు ప్రక్రియను ప్రారంభించారు.

తొలి రోజు రెండెకరాల వరకు, రెండో రోజు మూడెకరాల వరకు, మూడో రోజు నాలుగెకరాల వరకు, నాలుగో రోజు ఐదెకరాల వరకున్న రైతులకు రైతుభరోసా చెల్లింపులు పూర్తిచేశారు. ఇప్పటివరకు 62.47 లక్షల మంది రైతులకు రూ.6,405 కోట్లు చెల్లించినట్లు వ్యవసాయశాఖ గురువారం వెల్లడించింది. రాష్ట్రంలో కోటిన్నర ఎకరాల వ్యవసాయ భూమి ఉండగా... కోటి ఎకరాల పైచిలుకు విస్తీర్ణానికి చెల్లింపులు పూర్తయ్యాయి. మరో 50 లక్షల ఎకరాలకు ఐదారు రోజుల్లో చెల్లింపుల ప్రక్రియ పూర్తయ్యే అవకాశాలున్నాయి. ప్రభుత్వం ఈసారి ఎలాంటి పరిమితులు విధించడంలేదు. సాగు భూముల జాబితాలోని మొత్తం విస్తీర్ణానికి రైతుభరోసా చెల్లించాలని ప్రభుత్వం నిర్ణయించారు. అదునుచూసి ప్రభుత్వం పెట్టుబడి సాయం అందిస్తుండటంతో రైతులు హర్షం వ్యక్తంచేస్తున్నట్లు వ్యవసాయశాఖ తెలిపింది. రికార్డుస్థాయిలో రైతుల ఖాతాల్లో నిధులు జమచేస్తున్నట్లు పేర్కొంది. కాగా ఎలాం టి పరిమితులు విధించకుండా రైతులందరికి రైతుభరోసా చెల్లిస్తామని వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. ఈ పెట్టుబడి సాయాన్ని రైతులు వానాకాలం పంటల సాగు ఖర్చులకు వినియోగించుకోవాలని సూచించారు.

Updated Date - Jun 20 , 2025 | 05:14 AM