Teacher Promotions: టీచర్ల పదోన్నతులకు పచ్చజెండా
ABN, Publish Date - Jul 27 , 2025 | 03:43 AM
ప్రభుత్వ ఉపాధ్యాయుల పదోన్నతులకు సర్కారు ఆమోదం తెలిపింది. ఈ ప్రక్రియను సాధ్యమైనంత త్వరగా ప్రారంభించి, పూర్తిచేయాలని సీఎం రేవంత్ రెడ్డి శనివారం విద్యాశాఖ అధికారులను ఆదేశించారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆమోదం
రేపు షెడ్యూల్ విడుదలయ్యే అవకాశం
ప్రమోషన్లు పొందనున్న 4 వేల మంది
హైదరాబాద్, జూలై 26 (ఆంధ్రజ్యోతి): ప్రభుత్వ ఉపాధ్యాయుల పదోన్నతులకు సర్కారు ఆమోదం తెలిపింది. ఈ ప్రక్రియను సాధ్యమైనంత త్వరగా ప్రారంభించి, పూర్తిచేయాలని సీఎం రేవంత్ రెడ్డి శనివారం విద్యాశాఖ అధికారులను ఆదేశించారు. పాఠశాల విద్యాశాఖలో తొమ్మిదేళ్ల తర్వాత పదోన్నతులు, ఆరేళ్ల తర్వాత బదిలీలను గత ఏడాది నిర్వహించారు. దాదాపు 20 వేల మందికి పదోన్నతులు కల్పించారు. అయితే గత ఏడాది కాలంలో ఖాళీ అయిన స్థానాలను పదోన్నతులతో భర్తీ చేయాల్సి ఉంది. అంతకంటే ముందు బదిలీలు చేపట్టాల్సి ఉంది. ఈ ప్రక్రియ అంతా వేసవి సెలవుల్లో జరగాల్సి ఉండగా.. జాప్యమైంది. ఇప్పటికే విద్యాసంవత్సరం ప్రారంభమైనందున ప్రభుత్వం బదిలీల అంశాన్ని వాయిదా వేసి పదోన్నతులకు అనుమతించింది. పదోన్నతుల షెడ్యూల్ సోమవారం విడుదలయ్యే అవకాశముంది.
రాష్ట్రవ్యాప్తంగా 850 మంది ప్రధానోపాధ్యాయులుగా పదోన్నతులు పొందనున్నారు. వీరిలో మల్టీజోన్-1లో దాదాపు 500మంది ఉండగా, మల్టీజోన్-2లో 350 మంది వరకు ఉంటారు. అలాగే దాదాపు 3వేల మంది వరకు ప్రాథమిక పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, ఎస్‌జీటీలు, స్కూల్ అసిస్టెంట్లు, భాషా పండితులు పదోన్నతులు పొందనున్నారు. ఏడాది కాలంగా ఎదురుచూస్తున్న పదోన్నతులపై ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడాన్ని ఉపాధ్యాయ సంఘాలు స్వాగతించాయి. ఈ మేరకు టీఎ్‌సయూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు చావ రవి, వెంకట్.. సీఎం రేవంత్ రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు. ఉపాధ్యాయుల బదిలీల ప్రక్రియను కూడా చేపట్టాలని సీఎంను కోరారు.
ఈవార్తలు కూడా చదవండి..
పాడి కౌశిక్ రెడ్డిపై కేసు నమోదు..
సృష్టి టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్‌లో ఘోర తప్పిదం.. పోలీసుల కేసు నమోదు
Read latest Telangana News And Telugu News
Updated Date - Jul 27 , 2025 | 03:43 AM