Road Development: హ్యామ్ రోడ్ల పనులకు టెండర్లు!
ABN, Publish Date - Jul 25 , 2025 | 04:32 AM
రాష్ట్రంలో హైబ్రిడ్ యాన్యునిటీ మోడ్ (హ్యామ్) విధానంలో ఆర్‌అండ్‌బీ పరిధిలోని పలు రోడ్ల నిర్మాణం, అభివృద్ధికి ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఈ క్రమంలో మరో అడుగు ముందుకు పడింది.
31 నుంచి ప్రక్రియ ప్రారంభించనున్న ఆర్‌అండ్‌బీ
హైదరాబాద్, జూలై 24 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో హైబ్రిడ్ యాన్యునిటీ మోడ్ (హ్యామ్) విధానంలో ఆర్‌అండ్‌బీ పరిధిలోని పలు రోడ్ల నిర్మాణం, అభివృద్ధికి ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఈ క్రమంలో మరో అడుగు ముందుకు పడింది. రోడ్ల అభివృద్ధి పనులకు టెండర్లను ఆహ్వానించేందుకు ఆర్‌అండ్‌బీ సన్నద్ధమవుతోంది. ఈ నెల 31 నుంచే ప్రక్రియను ప్రారంభించి.. ఆగస్టు రెండో వారానికల్లా కొలిక్కి తేవాలని నిర్ణయించారు. ఈ మేరకు హ్యామ్ రోడ్ల పనులపై ముఖ్య అధికారులు గురువారం సచివాలయంలో కీలక సమావేశం నిర్వహించారు.
ఎట్టి పరిస్థితుల్లోనూ హ్యామ్ రోడ్ల పనుల్లో జాప్యం జరగడకూడదని నిర్ణయించినట్లు తెలిసింది. అలాగే మొదటి దశలో చేపట్టాలని నిర్ణయించిన 372 రోడ్ల సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్)లపైనా చర్చించారు. ఈ సమావేశంలో హ్యామ్ రోడ్ల కోసం నియమించిన కన్సల్టెన్సీ ప్రతినిధులు కూడా పాల్గొన్నారు. మరోవైపు హ్యామ్ రోడ్ల పనులపై మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఎప్పటికప్పుడు అధికారులతో మాట్లాడుతున్నారు. పనులు త్వరగా పూర్తయ్యేందుకు తీసుకోవాల్సిన చర్యల గురించి వారికి సూచనలు ఇస్తున్నారు.
Updated Date - Jul 25 , 2025 | 04:32 AM