హామీలను అమలు చేస్తూ ప్రజల్లో విశ్వాసం నింపాలి: కేసీఆర్
ABN, Publish Date - Jun 02 , 2025 | 05:55 AM
తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం దినోత్సవం జూన్ 2 సందర్భంగా బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు.
ప్రజలకు ఆవిర్భావ శుభాకాంక్షలు తెలిపిన బీఆర్‌ఎస్ అధినేత
తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం దినోత్సవం జూన్ 2 సందర్భంగా బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. పార్లమెంటరీ పంథాలో కొట్లాడి స్వరాష్ట్రాన్ని సాధించుకున్నామని, ఉమ్మడి పాలనలో ఆగమైన తెలంగాణను స్వయం పాలనలో అభివృద్ధి చేసుకున్నామని తెలిపారు.
సమస్త రంగాల్లో ప్రగతిని సాధిస్తూ, పదేండ్ల అనతికాలంలో తెలంగాణను దేశానికే ఆదర్శంగా నిలుపుకొన్నామని పేర్కొన్నారు. అదే స్ఫూర్తిని కొనసాగిస్తూ, అన్ని వర్గాల ప్రజల జీవన విధానం మరింత గుణాత్మకంగా సాగే దిశగా పాలనా ప్రాధాన్యతలను ఎంచుకొని అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి కేసీఆర్ సూచించారు. ఇచ్చిన హామీలను అమలు చేస్తూ ప్రజల్లో విశ్వాసం నింపాలన్నారు.
Updated Date - Jun 02 , 2025 | 05:55 AM