TIMS Hospitals: టిమ్స్ ఆస్పత్రుల ప్రారంభోత్సవ తేదీల్లో మార్పు
ABN, Publish Date - May 20 , 2025 | 04:03 AM
రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్మిస్తున్న ఎల్‌బీ నగర్, సనత్‌నగర్, అల్వాల్ తెలంగాణ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ అండ్ సైన్సెస్ (టిమ్స్) ఆస్పత్రుల ప్రారంభోత్సవ తేదీలు మారాయి.
జూన్ 26న ఎల్‌బీనగర్, ఆగస్టు 31న సనత్‌నగర్..
డిసెంబరులో అల్వాల్ టిమ్స్, వరంగల్ ఆస్పత్రి ప్రారంభం
హైదరాబాద్, మే 19 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్మిస్తున్న ఎల్‌బీ నగర్, సనత్‌నగర్, అల్వాల్ తెలంగాణ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ అండ్ సైన్సెస్ (టిమ్స్) ఆస్పత్రుల ప్రారంభోత్సవ తేదీలు మారాయి. వాస్తవానికి ఈ టిమ్స్‌ను ఈ ఏడాది జూన్ 2 నుంచి ప్రారంభించాలని ఆర్ అండ్ బీ, వైద్యారోగ్య శాఖలు లక్ష్యంగా పెట్టుకున్నాయి. ఈ మేరకు మంత్రులు కూడా పలు వేదికల్లో ప్రారంభోత్సవ తేదీలను ప్రక టించారు. నిర్మాణపరంగా 85-90 శాతం పనులు పూర్తయినప్పటికీ ఇతర దేశాల నుంచి రావాల్సిన అత్యాధునిక సాంకేతికతతో కూడిన యంత్రాలు రావడంలో జాప్యం జరుగుతోందని, దీంతో ఆస్పత్రుల ప్రారంభోత్సవాల్లోనూ ఆలస్యం జరుగుతోందని సమాచారం.
ఈ నేపథ్యంలో జూన్ 26న ఎల్‌బీ నగర్ టిమ్స్, ఆగస్టు 31న సనత్‌నగర్, డిసెంబరులో అల్వాల్ టిమ్స్‌ను ప్రారంభించేందుకు అధికారులు ప్రాథమికంగా తేదీలను ఖరారు చేశారు. ఈ విషయాన్ని ప్రభుత్వానికి తెలియజేశారు. మరోవైపు వరంగల్‌లో నిర్మిస్తున్న సూపర్‌స్పెషాలిటీ ఆస్పత్రిని కూడా డిసెంబరులో ప్రారంభించాలని నిర్ణయించారు.
Updated Date - May 20 , 2025 | 04:03 AM