మావోయిస్టు నాయకులను కోర్టులో హాజరుపర్చాలి
ABN, Publish Date - Jun 07 , 2025 | 05:23 AM
ఛత్తీస్‌గఢ్ పోలీసుల అదుపులో ఉన్న మావోయిస్టు నాయకులు బండి ప్రకాష్, నేషనల్ పార్క్ కార్యదర్శి దిలీప్, మద్దెడు ఏరియా కార్యదర్శి సీటు రామన్న..
సుధాకర్, భాస్కర్‌లను పట్టుకుని హత్య చేశారు
తెలంగాణ పౌర హక్కుల సంఘం
హైదరాబాద్, హైదరాబాద్ సిటీ, జూన్ 6 (ఆంధ్రజ్యోతి) : ఛత్తీస్‌గఢ్ పోలీసుల అదుపులో ఉన్న మావోయిస్టు నాయకులు బండి ప్రకాష్, నేషనల్ పార్క్ కార్యదర్శి దిలీప్, మద్దెడు ఏరియా కార్యదర్శి సీటు రామన్న, డీసీ సభ్యులు మున్నా, సునీత, మహే్‌షలతోపాటు పదిమందికి ప్రాణహాని తలపెట్టకుండా వెంటనే కోర్టులో హాజరు పరచాలని తెలంగాణ పౌర హక్కుల సంఘం డిమాండ్ చేసింది.
ఈమేరకు శుక్రవారం సంఘం అధ్యక్షుడు ప్రొఫెసర్ గడ్డం లక్ష్మణ్, ప్రధాన కార్యదర్శి నారాయణ ప్రకటన విడుదల చేశారు. ఛత్తీస్‌గఢ్‌లోని ఓ గ్రామంలో మావోయిస్టు నేతలు సుధాకర్, మైలారపు అడేళ్లు అలియాస్ భాస్కర్, బండి ప్రకాష్, దిలీప్, రామన్న, మున్నా, సునీత, మహే్‌షలతోపాటు పదిమందిని పోలీసులు ప్రాణాలతో పట్టుకున్నారన్నారు. సుధాకర్, భాస్కర్‌లను ఎన్‌కౌంటర్ పేరిట హత్య చేశారని, పోలీసుల అదుపులో ఉన్నవారిని కూడా హత్య చేసే ప్రమాదముందని, వారికి హాని తలపెట్టకుండా కోర్టులో హాజరుపర్చాలన్నారు. మావోయిస్టు పార్టీ ప్రకటించినట్టుగా కేంద్రం కూడా కాల్పుల విరమణ ప్రకటించి, శాంతిచర్చలు జరపాలని డిమాండ్ చేశారు.
Updated Date - Jun 07 , 2025 | 05:23 AM