ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Sitarama Lift Irrigation: సీతారామ సవరణ అంచనాలకు ఆమోదం

ABN, Publish Date - Jul 29 , 2025 | 03:42 AM

సీతారామ ఎత్తిపోతల పథకం/సీతమ్మసాగర్‌ బహుళార్థ ఎత్తిపోతల పథకం సవరించిన అంచనాలకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది.

  • రూ.13,058 కోట్ల నుంచి రూ.19,325 కోట్లకు పెంపు

  • ఇక పంట కాలువల ఆధునికీకరణతో పాటు మరమ్మతుల పనులు

  • ముఖ్యమంత్రి రేవంత్‌కు మంత్రి

  • తుమ్మల నాగేశ్వరరావు కృతజ్ఞతలు

హైదరాబాద్‌, జూలై 28(ఆంధ్రజ్యోతి): సీతారామ ఎత్తిపోతల పథకం/సీతమ్మసాగర్‌ బహుళార్థ ఎత్తిపోతల పథకం సవరించిన అంచనాలకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. సీఎం రేవంత్‌ అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఈ ప్రాజెక్ట్‌ అంచనాలను సవరించాలని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అభ్యర్థించారు. దీంతో ప్రాజెక్టు అంచనాలను రూ.13,057 కోట్ల నుంచి రూ.19,325 కోట్ల వరకు సవరిస్తూ అంగీకారం తెలిపారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్‌తో పాటు నీటిపారుదలశాఖ మంత్రి ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డికి, రాష్ట్ర మంత్రి వర్గానికి తుమ్మల ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. సవరించిన అంచనాలతో ఉమ్మడి ఖమ్మం జిల్లాతో పాటు మరో 3 జిల్లాలలో గోదావరి జలాలు పరుగులు పెట్టనున్నాయి. ఖమ్మం, కొత్తగూడెం, మహబూబాబాద్‌ జిల్లాల్లో 11 నియోజకవర్గాలు 31 మండలాల్లో 3,29,000 ఎకరాల కొత్త ఆయకట్టుతో పాటు 3,45,000 ఎకరాల ఆయకట్టుకు నీరిచ్చి స్థిరీకరించనున్నారు. సీతారామ ప్రాజెక్టు పరిధిలోని అన్ని పంట కాలువల ఆధునికీకరణతో పాటు మరమ్మతులు చేపట్టనున్నారు. సీతారామ ఎత్తిపోతల పథకం-సీతమ్మ సాగర్‌ బహుళార్థ సాధక ప్రాజెక్టుల డీపీఆర్‌కు కేంద్ర జలవనరుల సంఘంలోని సాంకేతిక సలహా కమిటీ ఇప్పటికే అనుమతి కూడా ఇచ్చింది. తద్వారా పూర్తి స్థాయిలో సాగునీటిని రైతాంగానికి అందించడం, పరిశ్రమలకు మిషన్‌ భగీరథ పథకం ద్వారా తాగు నీటిని అందిస్తారు.

పత్తి విత్తన రైతులకు పెండింగ్‌ బిల్లులు చెల్లించాలి

జోగులాంబ గద్వాల జిల్లా పత్తి రైతులకు పెండింగ్‌లో ఉన్న రూ.700 కోట్ల బకాయులను వెంటనే చెల్లించాలని మంత్రి తుమ్మల విత్తన కంపెనీలను ఆదేశించారు. గద్వాల జిల్లా రైతులు 50 వేల ఎకరాల్లో పత్తి విత్తనాలు సాగుచేశారని, నెలలు గడిచినా చెల్లింపులు చేయలేదని స్థానిక ఎమ్మెల్యే కృష్ణమోహన్‌రెడ్డి ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చినట్లు తెలిపారు. ఈ అంశంపై సెక్రటేరియట్‌లో విత్తన కంపెనీల ప్రతినిధులతో సమీక్ష నిర్వహించారు.

ఇవి కూడా చదవండి..

కాల్పుల విరమణలో అమెరికా పాత్ర లేదు, మోదీకి ఫోన్ కాల్ రాలేదు

22 నిమిషాల్లో ఆపరేషన్ సిందూర్ పూర్తి చేశాం: రాజ్‌నాథ్

For More National News and Telugu News..

Updated Date - Jul 29 , 2025 | 03:42 AM