Teacher Attendance: రిజిస్టర్ సంతకానికి చెల్లు
ABN, Publish Date - Aug 02 , 2025 | 04:51 AM
ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయుల హాజరులో పారదర్శకత పాటించేలా.. విద్యాశాఖ ప్రవేశపెట్టిన ఉపాధ్యాయుల ముఖ గుర్తింపు హాజరు (ఫేషియల్ రికగ్నిషన్ సిస్టం-ఎ్‌ఫఆర్‌ఎస్) విధానం శుక్రవారం నుంచి అమలులోకి వచ్చింది.
బడుల్లో ‘ముఖ గుర్తింపు హాజరు’
రాష్ట్రవ్యాప్తంగా తొలిరోజు 93.35ు
74% హాజరుతో పెద్దపల్లి జిల్లా అత్యల్పం
హైదరాబాద్, ఆగస్టు 1 (ఆంధ్రజ్యోతి): ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయుల హాజరులో పారదర్శకత పాటించేలా.. విద్యాశాఖ ప్రవేశపెట్టిన ఉపాధ్యాయుల ముఖ గుర్తింపు హాజరు (ఫేషియల్ రికగ్నిషన్ సిస్టం-ఎ్‌ఫఆర్‌ఎస్) విధానం శుక్రవారం నుంచి అమలులోకి వచ్చింది. దీనికోసం ఉపాధ్యాయులు తమ ఆండ్రాయిడ్ ఫోన్లలో ‘డీఎ్‌సఈ ఎఫ్‌ఆర్‌ఎస్’ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇది జీపీఎ్‌సకు అనుసంధానంగా ఉండటంతో.. ఉపాధ్యాయులు పాఠశాలకు వచ్చిన తర్వాతే యాప్ ద్వారా స్వీయచిత్రం(సెల్ఫీ)తో హాజరు నమోదవుతోంది. పాఠశాలకు దూరంగా ఉంటే యాప్ పనిచేయదు.
రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 24,973 పాఠశాలలుండగా.. 24,951 (99.91ు) పాఠశాలల్లో ఈ విధానాన్ని ప్రారంభించారు. అయితే ఈ యాప్ ప్రస్తుతం కేవలం ఆండ్రాయిడ్ వినియోగదారులకు అందుబాటులో ఉండటంతో.. ఐఫోన్ వినియోగదారులు దీనికి దూరంగా ఉండిపోయారు. రాష్ట్రంలో మొత్తం 1,28,760మంది ఉపాధ్యాయులుండగా.. సాంకేతిక కారణాలతో 25.18శాతం మంది కొత్త హాజరు విధానానికి దూరంగా ఉన్నారు. రిజిస్టర్ చేసుకున్న 96,327 ఉపాధ్యాయుల్లో తొలిరోజు 89,922 (93.35ు) మంది హాజరయ్యారు. అయితే ఎఫ్‌ఆర్‌ఎస్ విధానాన్ని మొదట ప్రయోగాత్మకంగా ప్రారంభించిన పెద్దపల్లిలో 2,607(97.17ు) మంది ఉపాధ్యాయులు రిజిస్టర్ చేసుకోగా.. మొదటిరోజు 1,944 (74.57ు)మందే హాజరయ్యారని పాఠశాల విద్యాశాఖ సంచాలకులు నవీన్ నికోలస్ తెలిపారు.
Updated Date - Aug 02 , 2025 | 04:51 AM