ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

జేఎన్‌టీయూలో సుజుకీ ఇన్నోవేషన్‌ సెంటర్‌!

ABN, Publish Date - Jun 17 , 2025 | 03:48 AM

జేఎన్‌టీయూలో ఇన్నోవేషన్‌ సెంటర్‌ ఏర్పాటు చేసేందుకు జపాన్‌కు చెందిన మోటార్‌ వాహనాల తయారీ కంపెనీ సుజుకీ ముందుకొచ్చింది.

  • కోర్‌ బ్రాంచ్‌ల విద్యార్థులకు నైపుణ్య, ఉపాధి శిక్షణ

  • వర్సిటీ అధికారులతో ఆ కంపెనీ ప్రతినిధుల చర్చలు

  • ఈ విద్యా సంవత్సరంలోనే ప్రారంభించే అవకాశం

హైదరాబాద్‌ సిటీ, జూన్‌16(ఆంధ్రజ్యోతి): జేఎన్‌టీయూలో ఇన్నోవేషన్‌ సెంటర్‌ ఏర్పాటు చేసేందుకు జపాన్‌కు చెందిన మోటార్‌ వాహనాల తయారీ కంపెనీ సుజుకీ ముందుకొచ్చింది. ఈ మేరకు సోమవారం ఆ సంస్థ ప్రతినిధులు జేఎన్‌టీయూ క్యాంపస్‌ కళాశాల ప్రిన్సిపాల్‌ జీవీ నర్సింహారెడ్డితో భేటీ అయ్యారు. మెకానికల్‌, మెటలర్జికల్‌, ఎలక్ట్రికల్‌, ఎలకా్ట్రనిక్స్‌ ఇంజనీరింగ్‌ విద్యార్థుల్లో నైపుణ్యాలను పెంపొందించేందుకు అవకాశం కల్పించాలని కోరారు. శిక్షణ పూర్తి చేసుకున్న విద్యార్థులకు జపాన్‌లోని సుజుకీ, మిత్సుబిషి, టయోటా, హోండా, నిస్సాన్‌ వంటి కంపెనీల్లో మెరుగైన ఉద్యోగాలు లభించే అవకాశం ఉందని వివరించారు.

ప్రిన్సిపాల్‌ను కలిసిన వారిలో సుజుకీ కంపెనీ ప్రతినిధులు షుంసుకె ఆకీ, నయోకీ నమోటో ఉన్నారు. కాగా ఐఐటీల్లోనే కాకుండా జేఎన్‌టీయూ వంటి సాంకేతిక విద్యాసంస్థల్లోనూ ఇన్నోవేషన్‌ సెంటర్లను ఏర్పాటు చేయాలని భావిస్తున్నట్లు సుజుకీ కంపెనీ ప్రతినిధులు పేర్కొన్నారు. ప్రస్తుత విద్యా సంవత్సరంలోనే ఇన్నోవేషన్‌ సెంటర్‌ను ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు తెలిసింది. కోర్‌ బ్రాంచ్‌ల విద్యార్థులకు నైపుణ్య శిక్షణ ఇవ్వడం ద్వారా ఉద్యోగ అవకాశాలు మెరుగవుతాయని ప్రిన్సిపాల్‌ నర్సింహారెడ్డి అభిప్రాయపడ్డారు.

Updated Date - Jun 17 , 2025 | 03:48 AM