ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

KTR: కేటీఆర్‌కు సుప్రీం కోర్టు నోటీసులు

ABN, Publish Date - Jun 07 , 2025 | 04:55 AM

బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌కు సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. మూసీ సుందరీకరణ ప్రాజెక్టు పేరుతో రూ.25 వేలకోట్లను కాంగ్రెస్‌ ప్రభుత్వం తరలించిందంటూ కేటీఆర్‌ చేసిన ఆరోపణలు తమ పార్టీ ప్రతిష్ఠను దెబ్బతీశాయంటూ ఆత్రం సుగుణ ఫిర్యాదు చేశారు.

  • ఆత్రం సుగుణ పిటిషన్‌పై విచారణ

న్యూఢిల్లీ, జూన్‌ 6 (ఆంధ్రజ్యోతి) : బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌కు సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. మూసీ సుందరీకరణ ప్రాజెక్టు పేరుతో రూ.25 వేలకోట్లను కాంగ్రెస్‌ ప్రభుత్వం తరలించిందంటూ కేటీఆర్‌ చేసిన ఆరోపణలు తమ పార్టీ ప్రతిష్ఠను దెబ్బతీశాయంటూ ఆత్రం సుగుణ ఫిర్యాదు చేశారు. ఆదిలాబాద్‌ జిల్లా ఉట్నూరు పోలీస్‌ స్టేషన్‌లో గత ఏడాది సెప్టెంబర్‌ 30న కేటీఆర్‌పై ఎఫ్‌ఐఆర్‌ నమోదైంది. తనపై తప్పుడు కేసును బనాయించారని కేటీఆర్‌ హైకోర్టును ఆశ్రయించగా..


జస్టిస్‌ కె.లక్ష్మణ్‌ నేతృత్వంలోని ధర్మాసనం ఆ ఎఫ్‌ఐఆర్‌ను కొట్టివేసింది. ఈ ఏడాది ఏప్రిల్‌ 21న తుది తీర్పును వెలువరించింది. హైకోర్టు తీర్పును ఆత్రం సుగుణ మే 19న సుప్రీం కోర్టులో సవాల్‌ చేశారు. ఆ పిటిషన్‌ శుక్రవారం జస్టిస్‌ సంజయ్‌ కరోల్‌, జస్టిస్‌ సతీ్‌షచంద్రశర్మతో కూడిన ద్విసభ్య ధర్మాసనం విచారించింది. సుగుణ పిటిషన్‌కు సమాధానం చెప్పాలంటూ ప్రతివాదులుగా ఉన్న కేటీఆర్‌, తెలంగాణ ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను ఆగస్టు 25కు వాయిదా వేసింది.

Updated Date - Jun 07 , 2025 | 04:55 AM