Sri Chaitanya : ఇంటర్ ఫలితాల్లో సత్తా చాటిన శ్రీ చైతన్య
ABN, Publish Date - Apr 23 , 2025 | 04:34 AM
టర్ ఫలితాల్లో తమ విద్యార్థులు సత్తా చాటారని శ్రీ చైతన్య విద్యాసంస్థల అకాడమిక్ డైరెక్టర్ సుష్మశ్రీ తెలిపారు.
హైదరాబాద్, ఏప్రిల్, 22(ఆంధ్రజ్యోతి): ఇంటర్ ఫలితాల్లో తమ విద్యార్థులు సత్తా చాటారని శ్రీ చైతన్య విద్యాసంస్థల అకాడమిక్ డైరెక్టర్ సుష్మశ్రీ తెలిపారు. జూనియర్ ఇంటర్ ఎంపీసీలో 103 మంది విద్యార్థులు 468 మార్కులు సాధించినట్లు మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. 462 మంది 467, ఆపైన మార్కులు సాధించినట్లు, 1073 మంది 466 ఆపైన మార్కులు, 4490 మంది 460 ఆపైన, 8479 మంది 450 ఆపైన మార్కులు సాధించారని వెల్లడించారు. జూనియర్ ఇంటర్ బైపీసీలో 440 మార్కులకుగాను 26 మంది 438 మార్కులు సాధించారని తెలిపారు.
136 మంది 437 ఆపైన మార్కులు, 304 మంది 436 ఆపైన, 459 మంది 435 ఆపైన, 1495 మంది 430 ఆపైన మార్కులు సాధించారన్నారు. అలాగే సీనియర్ ఇంటర్లో తమ విద్యార్థి 996 మార్కులు సాధించారని, ఏడుగురు 995 మార్కులు సాధించారని పేర్కొన్నారు. సరైన ప్రణాళిక, అగ్రశ్రేణి అధ్యాపకుల శిక్షణతో ఈ విజయం సాధ్యమైందని తెలిపారు.
Updated Date - Apr 23 , 2025 | 04:34 AM