ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

ఘనంగా శ్రీచైతన్య ‘ఐరావత్‌’ చాంపియన్స్‌ వేడుక’

ABN, Publish Date - Jun 18 , 2025 | 05:21 AM

హైటెక్‌ సిటీ శిల్పకళా వేదికలో శ్రీచైతన్య ‘ఐరావత్‌ చాంపియన్స్‌’ వేడుకలు ఘనంగా జరిగాయి.

  • ముఖ్య అతిథులుగా చెస్‌ చాంపియన్‌ గుకేష్‌, సినీ నటుడు అడివి శేష్‌

  • జేఈఈ, నీట్‌ విజేతలకు సన్మానం

హైదరాబాద్‌/హైటెక్‌ సిటీ, జూన్‌ 17 (ఆంధ్రజ్యోతి): హైటెక్‌ సిటీ శిల్పకళా వేదికలో శ్రీచైతన్య ‘ఐరావత్‌ చాంపియన్స్‌’ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా జేఈఈ, నీట్‌ పరీక్షల్లో జాతీయ స్థాయి ర్యాంకులు సాధించిన తమ విద్యార్థులను శ్రీచైతన్య విద్యాసంస్థ సన్మానించింది. కార్యక్రమానికి ప్రపంచ చెస్‌ చాంపియన్‌ గుకేష్‌ దొమ్మరాజు, సినీనటుడు అడివి శేష్‌ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. జాతీయ స్థాయి పోటీ పరీక్షల ఫలితాల్లో శ్రీచైతన్య విద్యాసంస్థలు మరోసారి అగ్రస్థానాన్ని సాధించి ఆలిండియా నంబర్‌ వన్‌గా నిలిచాయని విద్యాసంస్థల డైరెక్టర్లు సుష్మ బొప్పన, సీమ బొప్పన, శ్రీధర్‌ యలమంచిలి తెలిపారు.

శ్రీచైతన్య విద్యా సంస్థల బ్రాండ్‌ అంబాసిడర్‌గా చెస్‌ చాంపియన్‌ గుకే్‌షను నియమించడం పట్ల సంతోషాన్ని వ్యక్తం చేశారు. అనంతరం గుకేష్‌ దొమ్మరాజు మాట్లాడుతూ.. చదరంగం మాదిరిగానే జేఈఈ, నీట్‌ పరీక్షల్లో విజయానికి వ్యూహాత్మక ఆలోచన, క్రమ శిక్షణ, మానసిక స్థైర్యం ఎంతో అవసరమని అన్నారు. ఈ సందర్భగా విద్యార్థులు పలు సాంస్కృతిక కార్యక్రమాలతో హోరెత్తించారు.

Updated Date - Jun 18 , 2025 | 05:21 AM